Site icon NTV Telugu

Kaliyugapattanamlo: ఆలోచింపజేసేలా చంద్రబోస్ రాసిన ‘కలియుగం పట్టణంలో’ టైటిల్ సాంగ్

Kaliyugam Pattanamlo

Kaliyugam Pattanamlo

Kaliyugapattanamlo Chandrabose Title Song seems Intresting: ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ రాసిన పాటలు సమాజాన్ని ప్రతిబింబించేలా ముఖ్యంగా ఆలోచింపజేసేలా ఉంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను చైతన్యం కలిగించేలా ఉంటాయి. ఇక ఇప్పుడు చంద్రబోస్ రాసిన ‘కలియుగం పట్టణంలో’ టైటిల్ సాంగ్ అందరినీ ఆలోచింపజేసేలా సాగింది. ఈ సాంగ్ లో కలి ప్రభావం, కలియుగం ఎలా ఉందో ఆయన అందరికీ చెప్పే ప్రయత్నం చేశారు. నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘కలియుగం పట్టణంలో’ సినిమాను కందుల చంద్ర ఓబుల్ రెడ్డి నిర్మించారు.

కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలు రమాకాంత్ రెడ్డి చూసుకున్న ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ పెంచారు. ఈ క్రమంలోనే సినిమా నుంచి వరుసగా పాటలు రిలీజ్ చేస్తూ వస్తున్నారు మేకర్స్. తాజాగా సమాజాన్ని ఆలోచింపజేసేలా చంద్రబోస్ రాసిన గీతాన్ని రిలీజ్ చేశారు. కలియుగం పట్టణంలో టైటిల్ సాంగ్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పాటను విజయ్ ప్రకాష్ ఆలపించగా అజయ్ అరసాద అందించిన బాణీ ఎంతో క్యాచీగా ఉంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు మేకర్స్. విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్, చిత్రా శుక్లా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి చరణ్ మాధవనేని కెమెరామెన్ గా వ్యవహరించారు. గ్యారీ బీహెచ్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

Exit mobile version