Site icon NTV Telugu

Kaliyuga Pattanam Lo: జో జో లాలీ అమ్మ సాంగ్ ను రిలీజ్ చేసిన చిరు డైరెక్టర్..

Vasista

Vasista

Kaliyuga Pattanam Lo: నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తిక్, ఆయూషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘కలియుగం పట్టణంలో’ అనే ఓ డిఫరెంట్ మూవీ రాబోతోంది. కందుల గ్రూప్ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను రమాకాంత్ రెడ్డి చూసుకుంటున్నారు. రమాకాంత్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌లు కలిసి సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. మార్చి 22న రాబోతోన్న ఈ మూవీలో చిత్రా శుక్లా ప్రధాన పాత్రను పోషిస్తున్నారు.రీసెంట్ గా విడుదల చేసిన రిలీజ్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఇక తాజాగా రిలీజ్ చేసిన ‘జో జో లాలీ అమ్మ’ పాటతో మదర్ సెంటిమెంట్ ఉంటుందని చెప్పేశారు. ఈ పాటను ప్రముఖ దర్శకుడు వశిష్ట రిలీజ్ చేశారు. పాట చాలా బాగుందని చిత్రయూనిట్‌ను అభినందించారు. సినిమా పెద్ద హిట్ అవ్వాలని యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు.

భాస్కరభట్ల రాసిన సాహిత్యం, అనురాగ్ కులకర్ణి గాత్రం, అజయ్ అరసాద వినసొంపైన బాణీ ఇలా అన్నీ కలిపి మరో ట్రెండ్ సెట్టర్ లాలి పాట వచ్చినట్టుగానే అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. కడప జిల్లాలోనే షూటింగ్‌ను ఫినిష్ చేశారు. 45 రోజుల కాల వ్యవధిలో సినిమా షూటింగ్ ఎటువంటి ఆటంకాలు లేకుండా, విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఎడిటర్‌గా గ్యారీ బీహెచ్ వంటి టాప్ టెక్నీషియన్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. అజయ్ అరసాద సంగీతాన్ని అందించగా ఆస్కార్ అవార్డ్ గ్రహీత చంద్రబోస్, భాస్కర భట్ల వంటి వారు పాటలకు సాహిత్యాన్ని అందించారు. చరణ్ మాధవనేని కెమెరామెన్‌గా పని చేశారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలను చేపట్టనున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Exit mobile version