Site icon NTV Telugu

K Vishwanath: ముగిసిన కళాతపస్వి అంత్యక్రియలు

Kv

Kv

K Vishwanath: ఇంకో తెలుగు కీర్తి కీరిటం నింగికేగింది. తెలుగు సినిమా అంటే ఇది.. తెలుగు సంస్కృతి అంటే ఇది అని చూపించిన దర్శకుడు కె. విశ్వనాథ్ గగన తీరాలకు చేరుకున్నారు. కొన్ని రోజులుగా వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గత రాత్రి కన్నుమూసిన విషయం తెల్సిందే. టాలీవుడ్ మాత్రమే కాదు యావత్ చిత్ర పరిశ్రమ ఆయన మరణ వార్తతో తీవ్ర దిగ్బ్రాంతిలోకి కూరుకుపోయింది. రాత్రి నుంచి సినీ, రాజకీయ ప్రముఖులు.. విశ్వనాథ్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఇక కొద్దిసేపటి క్రితమే కళాతపస్వి అంత్యక్రియలు ముగిశాయి.

పంజాగుట్ట స్మశానంలో ఆయన అంత్యక్రియలను కుటుంబ సభ్యులు శాస్త్రోక్తంగా జరిపించారు. ఇక తమ అభిమాన డైరెక్టర్ కన్నుమూయడంతో అభిమానులు ఆయన కడచూపు కోసం స్మశాన వాటికకు భారీగా తరలివచ్చారు. విశ్వనాథ్ అంతిమ యాత్రలో అభిమానులతో పాటు పలువురు సినీ, రాజకీయ నేతలు కూడా పాల్గొని ఆయనకు నివాళులు అర్పించారు.

Exit mobile version