Site icon NTV Telugu

Kalanki Bhairavudu: ఫస్ట్ లుక్ తోనే భయపెడుతున్న ‘కాళాంకి బైరవుడు’

Kalanki Bhairavudu

Kalanki Bhairavudu

శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట, నివాసి చిత్రాల తర్వాత గాయత్రి ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న చిత్రం “కాళాంకి భైరవుడు”. హారర్, థ్రిల్లర్ జోనర్ లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రాజశేఖర్ వర్మ, పూజ కిరణ్ హీరో, హీరోయిన్స్ గా నటిస్తున్నారు. హరిహరన్.వి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కె.ఎన్.రావు, శ్రీనివాసరావు.ఆర్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని రాజశేఖర్, జీవిత లాంచ్ చేశారు. హీరోని ఇంటెన్స్ లుక్ లో పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిపోయింది. ఈ చిత్రం లో ఆమని, రితిక చక్రవర్తి, నాగ మహేష్, బలగం జయరాం, భవ్య, మహమ్మద్ బాషా, బిల్లి మురళి నటిస్తున్నారు. ”ఈ చిత్రం హారర్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో తీయడం జరిగింది. దాదాపు షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అతి త్వరలో ఈ చిత్రం విడుదల చేయడం జరుగుతుంది’ అని నిర్మాతలు తెలియజేశారు.

Exit mobile version