Kalaipuli S Thanu: సినిమా రంగం ఎంత వాణిజ్యపరమైనది అయినా… ఆపన్నులను ఆదుకునే మంచి మనస్కులు సైతం ఆ రంగంలో ఉన్నారు. తాజాగా ప్రముఖ తమిళ నిర్మాత కలైపులి ఎస్. థాను అదే ఉదారతను చాటుకున్నారు. చెన్నయ్ కావేరి హాస్పిటల్ లో ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న 33 సంవత్సరాల సింగిల్ మదర్ కు ఆయన ఆర్థిక సాయం చేశారు. వివరాలలోకి వెళితే… గత రెండేళ్ళుగా ఓ మహిళ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతోంది. కావేరీ హాస్పిటల్ లో చికిత్స కోసం చేరగా, రెండు ఊపిరితిత్తుల ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని అక్కడి వైద్యులు తెలిపారు. అందుకోసం ఆమె ట్రాన్స్ ప్లాంట్ అధారిటీ ఆఫ్ తమిళనాడులో తన పేరును నమోదు చేసుకుంది. ఆ మహిళ కన్నీటి గాథ తన దృష్టికి రావడంతో ఆపరేషన్ కు అవసరమైన రూ. 5 లక్షల రూపాయలను కలైపులి ఎస్. థాను కావేరి హాస్పిటల్ లోని వైద్యులు అయ్యప్పన్ పొన్నుస్వామి, మెడికల్ డైరెక్టర్ డా. యామిని కన్నప్పన్ లకు అందచేశారు. మొత్తం వ్యయంలో తాము కూడా కొంత రాయితీ ఇస్తున్నామని, అలానే మరికొందరు దాతలు చేసే సాయం కోసం ఎదురు చూస్తున్నామని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి.
Kalaipuli S Thanu: మహిళ ప్రాణాలు కాపాడిన తమిళ నిర్మాత!
Show comments