Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన విషయం విదితమే. ఇక ప్రస్తుతం మాతృత్వపు మాధుర్యాన్ని అనుభవిస్తున్న ఆమె త్వరలో మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు గత కొన్నిరోజుల నుంచి వార్తలు గుప్పుమంటున్నాయి. గర్భవతిగా ఉన్నప్పుడు బొద్దుగా కనిపించిన కాజల్.. ఇప్పుడు పూర్తిగా మారిపోయి మునుపటి రూపాన్ని సంతరించుకొంది. ఇక దీంతో మరోసారి తన సత్తా చాటాడడానికి రెడీ అయిపోయిందట చందమామ. అయితే కమర్షియల్ సినిమాల్లో కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తుందని టాక్. ఇక ఈ మధ్యనే ఒక వెబ్ సిరీస్ కోసం కాజల్ వర్క్ చేస్తున్నట్లు వినికిడి. ఇప్పటికే కాజల్ ఒక హర్రర్ వెబ్ సిరీస్ లో నటించి మెప్పించిన విషయం తెల్సిందే.
ఇక తన రీ ఎంట్రీ కూడా వెబ్ సిరీస్ తోనే ప్రారంభించాలని చూస్తున్నదట. ఇప్పటికే కథను విన్న కాజు.. స్క్రిప్ట్ నచ్చడంతో వెంటనే షూటింగ్ మొదలుపెట్టమన్నట్లు సమాచారం. ఒక వేళ ఇదే కనుక నిజమైతే చందమామ ఫ్యాన్స్ కు పండగే అని చెప్పొచ్చు. పెళ్లి తరువాత కాజల్ నటించిన ఏ సినిమా రిలీజ్ కాలేదు. ఆచార్యలో ఆమె పాత్రను తీసేసేసారు. ది ఘోస్ట్ లో కాజల్ ప్లేస్ ను రీప్లేస్ చేశారు. దీంతో కాజల్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురి అయ్యారు. ఇక చందమామ రీ ఎంట్రీ ఇస్తుందని తెలియడంతో వారందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ బ్యూటీ తన రీ ఎంట్రీ ఎంత గ్రాండ్ గా ఇవ్వనున్నదో చూడాలి.
