NTV Telugu Site icon

Kajal Aggarwal: బాడీ సహకరించడం లేదని.. ఏకంగా అవే నేర్చుకుంటున్న చందమామ

Kajal

Kajal

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ ప్రస్తుతం మార్షక్ల్ ఆర్ట్స్ నేర్చుకుంటూ ఫుల్ బిజీగా మారిపోయింది. పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన కాజల్.. బిడ్డ పుట్టాక మొత్తం సమయాన్ని కొడుకును చూసుకుంటూనే గడిపేసింది. అయినా అభిమానులను ఎక్కడా నిరాశపర్చకుండా నిత్యం సోషల్ మీడియాలో వారికి దగ్గరగానే ఉంటూ మెప్పిస్తోంది. ఇక తాజాగా కాజల్ సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. పెళ్ళికి ముందే ఈ భామ కమల్ హాసన్ సరసన ఇండియన్ 2 లో నటించడానికి ఒప్పుకున్నా విషయం విదితమే. ఎప్పుడో పూర్తీ కావాల్సిన ఈ సినిమా వివాదాలు, విరామాలు మధ్య వాయిదాలు పడుతూ వచ్చింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎట్టకేలకు పట్టాలెక్కింది. ఇటీవలే ఈ సినిమా సెట్ లో కమల్ కూడా పాల్గొన్నాడు. ఇక తాజాగా కాజల్ వంతు కూడా వచ్చేసింది.

ఇండియన్ 2 కోసం తల్లి అయిన కాజల్ కొద్దిగా శ్రమిస్తోందని చెప్పాలి. గుర్రపు స్వారీ, మార్షల్ ఆర్ట్స్, కట్టి యుద్దాలు అన్ని నేర్చుకొంటుంది. అందుకు సంబంధించిన వీడియోలను అభిమానులతో పంచుకొంటుంది. అయితే మొన్నటి మొన్న ఒక ఇంటర్వ్యూలో తల్లి అయ్యాకా నటనకు తన బాడీ సహకరించడం లేదని నిర్మొహమాటంగా చెప్పిన కాజు.. ఇప్పుడు ఇవన్నీ నేర్చుకోవడం కొద్దిగా ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే.. డబ్బులు తీసుకున్నాకా తప్పుతుందా.. ఆచార్యను వదులుకున్నట్లు ఇండియన్ 2 ను వదులుకోలేక ఇలా కష్టపడుతోంది అంటున్నారు అభిమానులు.. ఇక ఈసారి శంకర్.. కాజల్ ను యాక్షన్ క్వీన్ గా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. భారతీయుడు లో పెద్ద కమల్ హాసన్ భార్య సురేఖ కూడా అప్పట్లో యుద్దాలు చేసినట్లు చెప్పారు. ఇప్పుడు ఆ స్థానంలో కాజల్ కనిపిస్తుందా..? సేనాపతితో చందమామ యుద్ధ పోరాటాలు చేస్తుందా..? అనేది చూడాలి.