Site icon NTV Telugu

Bhagavanth kesari: ‘భగవంత్ కేసరి’ కోసం ‘కాత్యాయని’ కాజల్ వచ్చేసింది!

Katyayani

Katyayani

Kajal Agarwal Look as Katyayani Released: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ రో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘భగవంత్ కేసరి’ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే పలు అప్డేట్స్ రాగా ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు మేకర్స్. కాత్యాయని గా కాజల్ అగర్వాల్ ని పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ లో ట్రెడిషినల్ వేర్ లో బ్యూటిఫుల్ స్మైల్ తో కాజల్ ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఇక ట్రైలర్‌ను రివీల్ చేసే సమయాన్ని కూడా పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసిన మేకర్స్ ట్రైలర్ రేపు రాత్రి 8:16 గంటలకు విడుదల అవుతుందని ప్రకటించారు.

Nagababu: అబ్బాయిల వల్లే బ్రేకప్ లు, కంట్రోల్ చేయాలనుకునే ఇలా.. నాగబాబు కీలక వ్యాఖ్యలు!

షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా, నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. జాతీయ అవార్డు విన్నర్ అర్జున్ రాంపాల్ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతుండగా బాలకృష్ణను ఢీ కొట్టే పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ సినిమాకి ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తుండగా, సినిమాటోగ్రఫీ సి రామ్ ప్రసాద్, ఎడిటర్ తమ్మి రాజు, ప్రొడక్షన్ డిజైనర్ రాజీవ్. యాక్షన్‌ పార్ట్‌కి వి వెంకట్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు. భగవంత్ కేసరి దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానుంది.

Exit mobile version