Site icon NTV Telugu

Kaama and The Digital Soothras: “కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్”.. ఆసక్తి రేపేలా ట్రైలర్

Kama Digital Sutra

Kama Digital Sutra

వినయ్ వర్మ, తమేశ్వరయ్య అక్కల, చంద్రకళా ఎస్, అర్జున్, సురభి లలిత, శ్రీకాంత్, బుగత సత్యనారాయణ, దినేష్, జోగారావు కీలక పాత్రల్లో నటించిన సినిమా “కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్”. ఈ చిత్రాన్ని సుమలీల సినిమా బ్యానర్ పై ఎన్ హెచ్ ప్రసాద్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మంచి సందేశాత్మక కథా కథనాలతో రూపొందిన “కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్” సినిమాను ఈ నెల 12న శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు బాపిరాజు. బుధవారం హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో “కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్” సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు.

Also Read :Sanyuktha Menon: అఖండ2లో సంయుక్తమీనన్‌ హీరోయిన్నా? ఐటంగర్లా?

ఈ కార్యక్రమంలో నటుడు దినేష్ మాట్లాడుతూ ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేశాను. నటుడిగా నాకు గుర్తింపు తీసుకొచ్చే సినిమా అవుతుందని నమ్ముతున్నాను. ఈ సినిమా డైరెక్టర్ ప్రసాద్ గారు అందరికీ నచ్చేలా రూపొందించారు అన్నారు. నటి చంద్రకళా మాట్లాడుతూ “కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్” సినిమా స్క్రిప్ట్ చదివినప్పుడు ఈ మూవీ నేను చేయగలనా అని భయపడ్డాను. కానీ సినిమా ఇండస్ట్రీపై ప్యాషన్ తో వచ్చినప్పుడు అవకాశాలు ఎందుకు వదులుకోవాలి అని ఛాలెంజింగ్ గా తీసుకుని నటించాను. ఈ సినిమాలో మనందరం సొసైటీలో చూసే సోషల్ ఇష్యూస్ ఉంటాయి. అలాగే ప్రేక్షకులు థియేటర్స్ లో కోరుకునే ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది అన్నారు.

Exit mobile version