NTV Telugu Site icon

Kaala Bhairava: ఎన్టీఆర్-చరణ్ లని మర్చిపోయి ట్రోల్ అయ్యాడు…

Kaala Bhairava

Kaala Bhairava

కీరవాణి కొడుకుగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి సింగర్ గా ఎంట్రీ ఇచ్చిన కాలభైరవ, ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా మారి మంచి ఆల్బమ్స్ ఇస్తున్నాడు. జక్కన తెరకెక్కించిన ఎపిక్ యాక్షన్ డ్రామా ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డుని గెలిచింది. ఈ పాటని కాలభైరవ రాహుల్ సిప్లిగంజ్ తో కలిసి పాడిన విషయం తెలిసిందే. ఆస్కార్ స్టేజ్ పైన కూడా లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన కాలభైరవ, నాటు నాటు సాంగ్ విషయంలో ఒక ఎమోషనల్ పోస్ట్ ని ట్విట్టర్ లో పెట్టాడు. నాటు నాటు సాంగ్ అద్భుతంగా రావడానికి, ఆస్కార్ వేదికపైన నిలబడి పాట పాడే అవకాశాన్ని తనకి ఇచ్చిన ప్రతి ఒక్కరికీ కాలభైరవ థాంక్స్ చెప్తూ రిలీజ్ చేసిన నోట్ లో రాజమౌళి, కీరవాణి, వల్లిగారు, కార్తికేయ, ప్రేమ్ రక్షిత్ మాస్టర్… ఇలా అందరి పేర్లు ఉన్నాయి కానీ తనతో పాటు పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్, ఆ పాటని అంత అద్భుతంగా  రావడానికి ఎంతో కష్టపడిన ఎన్టీఆర్, చరణ్ పేర్లు లేవు.

చరణ్, ఎన్టీఆర్ పేర్లు మరిచిపోవడంతో కాలభైరవ సోషల్ మీడియాలో బ్యాక్ లాష్ ఫేస్ చెయ్యాల్సి వచ్చింది. తనకి నాటు నాటు అవకాశం రావడం అనే క్రెడిట్ గురించి మాత్రమే మాట్లాడిన కాలభైరవ నోట్ లో జరిగిన తప్పుని వెంటనే రియలైజ్ అయ్యి… “ఎన్టీఆర్, చరణ్ లేకపోతే అసలు నాటు నాటు పాటనే కాదు ఆర్ ఆర్ ఆర్ సినిమానే లేదు. నేను నాకు వచ్చిన ఆపర్చ్యునిటి గురించి మాత్రమే మాట్లాడాను. నా మాటలు రాంగ్ గా కన్వే అయ్యాయి. డెఫినేట్ గా సరైన పదాలని ఎంచుకోలేదు” సారీ చెప్పాడు. ప్రస్తుతం కాలభైరవ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Show comments