Site icon NTV Telugu

Manikandan: గుడ్ నైట్ కాంబినేషన్ రిపీట్… క్లాప్ కొట్టిన మక్కల్ సెల్వన్

Manikandan

Manikandan

కోలీవుడ్ లో ఎమర్జింగ్ యంగ్ టాలెంట్ గా పేరు తెచ్చుకున్నాడు ‘మణికందన్’. రైటర్, డైరెక్టర్, ఆర్టిస్ట్ అయిన మణికందన్… విక్రమ్ వేద, కాలా, పావ కథైగల్ సినిమాలతో ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. సూర్య ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన జై భీమ్ సినిమాలో ‘రాజకున్ను’ పాత్రలో మణికందన్ పెర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. జై భీమ్ సినిమా మణికందన్ కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. ఈ మూవీతో మంచి పేరు తెచ్చుకున్న మణికందన్, రీసెంట్ గా గుడ్ నైట్ మూవీతో సూపర్ హిట్ అందుకున్నాడు. నిద్రలో గురక పెట్టే అలవాటు ఉన్న ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిగా మణికందన్ చాలా నేచురల్ గా పెర్ఫార్మ్ చేసాడు.

Read Also: Nabha Natesh: అబ్బా అనిపించేలా ఉన్నావ్ నభా…

తమిళ్ లో మంచి హిట్ అయిన ఈ మూవీతో మణికందన్ కి సోలో హీరోగా అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. తొందరపడి సినిమాలు చెయ్యకుండా గుడ్ నైట్ సినిమా ప్రొడ్యూసర్స్ తోనే మరో సినిమాని స్టార్ట్ చేసాడు మణికందన్. గౌరీప్రియా రెడ్డి హీరోయిన్ గా నటించనున్న ఈ మూవీని వ్యాస్ డైరెక్ట్ చేస్తున్నాడు. గుడ్ నైట్ సినిమాకి సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చిన సీన్ రోల్డన్, ఈ సినిమాకి కూడా సంగీతం అందిస్తున్నాడు. ప్రొడక్షన్ నంబర్ 2గా మొదలైన ఈ మూవీని మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి క్లాప్ కొట్టి లాంచ్ చేసాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. మరి గుడ్ నైట్ మూవీ తరహాలోనే మణికందన్ మరో హిట్ అందుకుంటాడేమో చూడాలి.

Exit mobile version