NTV Telugu Site icon

No More Secrets: ‘నో మోర్ సీక్రెట్స్’ అంటూ లిప్‌లాక్‌తో రెచ్చిపోయిన జ్యోతి రాయ్!

Nms First Look

Nms First Look

Jyothi Rai No More Secrets Web Series First Look with Liplock Goes Viral: తెలుగు సీరియల్ ‘గుప్పెడంత మనసు’లో జగతిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి జ్యోతి రాయ్. ఇక ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లతోనూ సత్తా చాటే పనిలో ఉన్న ఈ ముదురు భామ షేర్ చేసిన ఓ రొమాంటిక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఆమె ‘నో మోర్ సీక్రెట్స్’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇందులో జ్యోతి రాయ్ కృనాల్ కపూర్ తో జంటగా కలిసి నటిస్తోంది. విజయ్ కుడికుల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సిరీస్‌ను పార్థిరెడ్డి, జీవన్ రెడ్డి, సంఘమిత్ర కలిసి నిర్మిస్తున్నారు. ముందు హిందీ ఇంగ్లీష్ లో రిలీజ్ చేయాలని అనుకున్నా ఇప్పుడు తెలుగులో ఈమెకు ఉన్న ఫాలోయింగ్ దెబ్బకు తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇక తాజాగా ఈ సిరీస్ కు సంబంధించిన పోస్టర్ ను జ్యోతి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేయగా అందులో బీచ్ లో కుర్రాడితో లిప్ లాక్ చేస్తూ ఆమె కనిపించింది.

Jabardasth Satya : భయపడుతూనే ఆ పాట చేశాను..

ఈ పోస్టర్ అయితే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక ప్రస్తుతం ఆమె మరికొన్ని వెబ్ సిరీస్ లలో నటించబోతోంది అంటున్నారు. ఇక నటనలో బిజీగా ఉన్నా ఈ భామ సోషల్ మీడియాలో అందాల విందులో ఎక్కడా తగ్గడం లేదు.ప్రస్తుతం ఆమె వయసు 38 ఏళ్లు. 20 ఏళ్ల వయసులోనే పద్మనాభ అనే వ్యక్తితో పెళ్లి కాగా ఓ బాబు కూడా ఉన్నాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకోవడంతో కొంతకాలం ఒంటరిగానే ఉన్నా ఈ మధ్య యువ దర్శకుడు సుకు పుర్వాజ్ తో ప్రేమలో పడింది. అతడిని పెళ్లి కూడా చేసుకున్నట్లు చెబుతున్నా అధికారికంగా ప్రకటించలేదు. సుకు కన్నడ సినిమా పరిశ్రమలో పలు హిట్ సినిమాలను తెరకెక్కించగా తెలుగులోనూ ‘మాస్టర్ పీస్’ అనే సినిమా డైరెక్ట్ చేశారు.

Show comments