NTV Telugu Site icon

Jyothi Rai: హీరోయిన్ గా గుప్పెడంత మనసు జగతి ఆంటీ.. పోస్టర్ చూశారా .. ఎంత హాట్ గా ఉందో

Jagathi

Jagathi

Jyothi Rai: గుప్పెడంత మనసు సీరియల్ చూసేవారికి జగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రిషి తల్లిగా ఆమె నటించిన తీరు ఎంతోమందిని ఆమెకు ఫ్యాన్స్ గా చేసింది. ఇక జగతి అసలు పేరు జ్యోతి రాయ్. ఆమె కన్నడకు చెందిన నటి. ఒకప్పుడు హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించిన జ్యోతి రాయ్.. ఆ తరువాత తెలుగులో గుప్పెడంత మనసు సీరియల్ తో పరిచయం అయ్యింది. ఈ సీరియల్ తో ఆమె ఎంతో గుర్తింపును తెచ్చుకుంది. కొన్ని రోజుల వరకు కూడా జ్యోతి గురించి పెద్ద ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏం లేదు కానీ, ఒక్కసారిగా ఆమె సోషల్ మీడియాలో అందాల ఆరబోత చేసేసరికి హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా ఈ చిన్నది.. డైరెక్టర్ ను రెండో పెళ్లి చేసుకుందని కూడా వార్తలు వచ్చాయి. ఎప్పుడు లేనిది జ్యోతి రాయ్.. ఇలా అందాల ఆరబోత చేయడానికి కారణం ఏంటి అని అభిమానులు చాలా ఆరాలు తీశారు. అస్సలు సీరియల్ లో ఆంటీ లా పద్దతిగా కనిపించే జ్యోతి రాయ్.. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాల ఆరబోతను చేయడంతో.. ఫ్యాన్స్ షాక్ అయ్యారు.

Prabhas: మోకాలి సర్జరీ పూర్తి.. డైనోసర్ ఇండియా వచ్చేది ఎప్పుడంటే.. ?

ఇక ఇదంతా.. ఈ భామ తన ఓటిటీ డెబ్యూ కోసమే చేసిందని తెలుస్తోంది. అవును .. అమ్మడు హీరోయిన్ గా ఒక సిరీస్ లో నటిస్తోంది. దాని పేరు.. ది ప్రెట్టీ గర్ల్ .. ది గుడ్ వైఫ్ క్యాస్టల్ అనేది ట్యాగ్ లైన్. ఈ సిరీస్ కు రాహుల్ దీపక్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఆమె ఈ సిరీస్ పోస్టర్ ను ఆమె తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ.. చిత్ర బృందానికి థాంక్స్ చెప్పింది. ఇక ఈ పోస్టర్ లో జ్యోతి రాయ్ లుక్ వేరే లెవెల్ అని చెప్పాలి .. రెడ్ కలర్ మినీ స్కర్ట్ లో అందాలను ఆరబోస్తూ కనిపించింది. ఇక ఈ పోస్టర్ చూసిన వారందరు.. దేవుడా.. ఇదెక్కడి హాట్ నెస్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ సిరీస్ ..లయన్స్ గేట్ ప్లే అనే ఓటిటీ లో రిలీజ్ కానుంది. మరి ఈ సిరీస్ తో ఈ భామ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Show comments