Just A Minute: అభిషేక్ పచ్చిపాల, నజియ ఖాన్, జబర్దస్త్ ఫణి మరియు సతీష్ సారిపల్లి ముఖ్య పాత్రల్లో నటించిన సినిమా జస్ట్ ఎ మినిట్. రెడ్ స్వాన్ ఎంటర్టై్మెంట్ మరియు కార్తీక్ ధర్మపురి ప్రెజెంట్స్ బ్యానర్లపై అర్షద్ తన్వీర్ మరియు డా. ప్రకాష్ ధర్మపురి నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమాకు పూర్ణస్ యశ్వంత్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ఫస్ట్ సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి రెండోవ సాంగ్ ను రిలీజ్ చేశారు. నువ్వంటే ఇష్టం అంటూ సాగే ఈ సాంగ్ ఎంతో అద్భుతంగా ఉంది. వాలెంటెన్స్ డే సందర్భంగా లవ్ సాంగ్ ను రిలీజ్ చేసి హైప్ తెచ్చారు.
ఇక ఈ సందర్భంగా దర్శకుడు పూర్ణస్ యశ్వంత్ మాట్లాడుతూ : గతంలో మేం రిలీజ్ చేసిన ఫస్ట్-లుక్ కి చాలా మంచి స్పందన లభించింది. తర్వాత టీజర్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ పాజిటివ్ కామెంట్స్ ఇస్తూ, డిఫరెంట్ గా ఉంది కాన్సెప్ట్ అని మెచ్చుకోవడం మాకు మంచి ధైర్యాన్నిస్తోంది. అతి త్వరలో ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయబోతున్నాం. ట్రైలర్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ రివీల్ అవుతాయి. గతంలో ఎన్నో అద్భుతమైన పాటలు పాడిన హైమత్ గారు ఈ సాంగ్ పాడడం సాంగ్ కి చాలా ప్లస్ అయ్యింది. రాంబాబు గోసాల గారి సాహిత్యం యువతని ఎంతగానో అలరిస్తుందని” చెప్పుకొచ్చాడు. ఇక ప్రొడ్యూసర్స్ మాట్లాడుతూ.. ” ఫస్ట్-లుక్, టీజర్‌కి వస్తున్న ఆదరణ మాకు చాలా ఉత్సాహాన్నిచ్చింది. ఇలాగే ప్రేక్షకుల ఆదరణ మా జస్ట్ ఎ మినిట్ సినిమా పైన, మా పైన ఉండాలని.. సినిమాను మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నామని అన్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.