Site icon NTV Telugu

WAR 2 : రిటర్న్ గిఫ్ట్ కోసం వెయిట్ చేయలేకపోతున్నా : జూనియర్ ఎన్టీఆర్

Jr Ntr Hrithik Roshan

Jr Ntr Hrithik Roshan

WAR 2 : జూనియర్ ఎన్టీఆర్ ప్రతి బర్త్ డేకు ఏదో ఒక బిగ్ అప్డేట్ ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్ డేకు వార్-2 నుంచి సర్ ప్రైజ్ ఉంటుందని ఎప్పటి నుంచో రూమర్లు వస్తున్నాయి. ఈ రోజు హృతిక్ రోషన్ కూడా దీన్ని రివీల్ చేస్తూ ట్వీట్ చేశాడు. ‘జూనియర్ ఎన్టీఆర్ మే 20న ఏం ఎక్స్ పెక్ట్ చేస్తున్నావ్.. నన్ను నమ్ము నువ్వు నీకు తెలియని మంచి గిఫ్ట్ రెడీ అవుతోంది’ అంటూ రాసుకొచ్చాడు.

Read Also : KTR: అది మీరు చేయగలరా.. కొండా సురేఖకు కేటీఆర్‌ కౌంటర్‌

ఈ ట్వీట్ కు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ స్పందించాడు. ‘థాంక్యూ హృతిక్ రోషన్ సర్. నువ్వు ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసుకోవాలని ఉంది. దానికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి చేయలేకపోతున్నా కబీర్’ అంటూ రిప్లై ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో హృతిక్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే. వార్ సినిమాకు సీక్వెల్ గా వస్తోంది ఈ మూవీ. ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. మరి ఎన్టీఆర్ బర్త్ డేకు ఎలాంటి గిఫ్ట్ వస్తుందో చూడాలి.

Read Also : Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి మరోసారి రిమాండ్!

Exit mobile version