Site icon NTV Telugu

సినిమా ఆర్టిస్ట్ సూసైడ్… ఆలస్యంగా వెలుగులోకి ఘటన

Junior Artist Suicide at Chandrayangutta

సినిమా ఆర్టిస్ట్ సూసైడ్ చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… సైద్ రహీమ్ అనే 24 ఏళ్ళ యువకుడు సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ గా పని చేస్తున్నాడు. పలు సినిమాల్లో నటించిన సైద్ తాజాగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే అతను అసలు ఆత్మహత్యకు పాల్పడడానికి గల కారణం ఏంటన్న విషయం ఇంకా తెలియరాలేదు. ప్రేమ వ్యవహారమా ? లేక సినిమా ఇండస్ట్రీలో ఛాన్సులు రాక సూసైడ్ కు పాల్పడ్డాడా ? మరేదైనా ఇతర కారణాలు అతని ఆత్మహత్య వెనుక దాగి ఉన్నాయా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read Also : నీకేంట్రా నొప్పి… బిగ్ బాస్ బ్యూటీ వార్నింగ్

Exit mobile version