NTV Telugu Site icon

Jr. NTR : నందమూరి తారక ‘రాముడు’ తో ఉన్న ‘లక్ష్మణుడు’ ఎవరంటే.?

Bollywood,abhishek Bachchan,aishwarya (7)

Bollywood,abhishek Bachchan,aishwarya (7)

ప్రజంట్ జపాన్ లో తెలుగు చిత్రాలకు ఎంత డిమాండ్ ఉందో మనకు తెలిసిందే. కథను బట్టి అక్కడ కూడా మన సినిమాలు బ్లక్‌బాస్టర్ అవుతున్నాయి. ఇక తాజాగా తారక్ ‘దేవర’ పార్ట్ 1 ను జపనీస్ భాషలో డబ్బింగ్ చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ తో ఆల్రెడీ తన నటనతో జపాన్ ప్రేక్షకులో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలో ‘దేవర’‌ను సైతం అక్కడ విడుదల చేస్తున్నారు మెకర్స్.‌ ఈ నెల 28న ఈ సినిమా జపాన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రీమియర్ షో సూపర్ రెస్పాన్స్ అందుకోగా.. ప్రచార కార్యక్రమాల కోసం జపాన్ వెళ్లిన ఎన్టీఆర్ సందడి చేస్తున్నాడు. సోషల్ మీడియాలో ప్రతి ఒక అప్ డేట్ వైరల్ అవుతూనే ఉంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే తారక్ తో పాటు, వెంట చరణ్ దేవినేని కూడా వెళ్లారు.. అసలు ఈ చరణ్ ఎవరు?

Also Read:Suhasini : నాకు ఆరేళ్ల నుంచే ఆ జబ్బు ఉంది.. నటి షాకింగ్ కామెంట్స్

ఎన్టీఆర్ సతీమణి ప్రణతి పుట్టిన రోజు ఇవాళ.. జపాన్ తో తన భార్య బర్త్ డే వేడుకలు జరుపుకున్నాడు తారక్. ఇదే రోజు చరణ్ దేవినేని బర్త్ డే కూడా. అయితే తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ప్రణతికి బర్త్ డే విషెస్ చెప్పిన ఎన్టీఆర్ స్టోరీలో చరణ్ దేవినేనితో జపాన్ లో దిగిన ఫోటోలను షేర్ చేసిన… ‘హ్యాపీ బర్త్ డే తమ్ముడు. మై ఎవ్రీడే లక్ష్మణుడు’ అని పేర్కొన్నారు. దీంతో అసలు ఎవరీ లక్ష్మణుడు అనే ఆసక్తి ప్రేక్షకులలో మొదలైంది..

ఇక ఈ చరణ్ ఎవరు అంటే.. హైదరాబాద్ లో టెనెట్ డయాగ్నొస్టిక్ సెంటర్ అందరికీ తెలిసే ఉంటుంది. మెడికల్ టెస్ట్ చేయడంలో చాలా పాపులర్. ఆ టెనెట్ ఓనర్ చరణ్ దేవినేని అని తెలిసింది. ఎన్టీఆర్ అంటే అతనికి చాలా అభిమానం. అంతకు మించి గౌరవం. అంతే కాదు ఎన్టీఆర్ సన్నిహితులలో చరణ్ దేవినేని ఒకరు. షూటింగ్స్ ఏవీ లేకుంటే తారక్ తరచూ కలిసే వ్యక్తులను చరణ్ దేవినేని కూడా ఒక్కరట. ఇప్పుడు ఎన్టీఆర్ ప్రణతి దంపతులతో పాటు చరణ్ దేవినేని కూడా జపాన్‌లో ఉన్నారంటే, వారి మధ్య బంధం ఎలాంటిదో అర్ధం అవుతుంది.