NTR: ‘సీఎం ఎన్టీఆర్’ నినాదాలతో దద్దరిల్లిన దుబాయ్… కోపంగా ఎన్టీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమురం భీమ్ క్యారెక్టర్ ని సూపర్బ్ గా పెర్ఫార్మ్ చేసి గ్లోబల్ ఆడియన్స్ ని మెప్పించాడు. తన అద్భుతమైన నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకున్న ఎన్టీఆర్ సైమాలో బెస్ట్ యాక్టర్ అవార్డుని గెలుచుకున్నాడు. దుబాయ్ లో జరుగుతున్న ఈ ఈవెంట్ కోసం ఎన్టీఆర్ దేవర షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి మరీ దుబాయ్ వెళ్ళాడు. బెస్ట్ యాక్టర్ గా ఎన్టీఆర్ అవార్డ్ అందుకునే ముందు దుబాయ్ మొత్తం జై ఎన్టీఆర్ నినాదాలతో హోరెత్తింది. ఎన్టీఆర్ ని చూడడానికి చాలా మంది ఫ్యాన్స్ సైమా ఈవెంట్ దగ్గరకి వెళ్లారు. అభిమానుల మధ్యలో రెడ్ కార్పెట్ పై ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ ని చూడగానే ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. రాత్రి 9 గంటల నుంచి ఎన్టీఆర్ ఎప్పుడు వస్తాడు అని వెయిట్ చేస్తూ నిద్ర కూడా పోకుండా మేలుకున్న ఫ్యాన్స్ కి ఎన్టీఆర్ సూపర్ స్టైలిష్ గా కనిపించడంతో జై ఎన్టీఆర్ నినాదాలతో రచ్చ చేసారు. ఇదే సమయంలో ఎన్టీఆర్ రెడ్ కార్పెట్ నడుస్తుండగా ‘సీఎం ఎన్టీఆర్’ అనే నినాదాన్ని ఎత్తుకున్నారు ఫ్యాన్స్.
సడన్ గా జై ఎన్టీఆర్ అనే స్లోగన్ పోయి సీఎం ఎన్టీఆర్ స్లోగన్ రీసౌండ్ వచ్చే రేంజులో వినిపించింది. సైమా ఈవెంట్ దగ్గరికి వచ్చిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా సీఎం ఎన్టీఆర్ అని అరవడంతో ఆ ఏరియా మొతం ఆ స్లోగనే వినిపించింది. దీంతో ఎన్టీఆర్ కి కోపం వచ్చినట్లు ఉంది, రెడ్ కార్పెట్ పై నడుస్తూ ఒక్కసారిగా సీఎం ఎన్టీఆర్ అని అరుస్తున్న వారివైపు చూసాడు. ఎవరినీ ఏమీ అనలేదు, వద్దని వారించనూ లేదు కానీ ఎన్టీఆర్ సైలెంట్ గా రెడ్ కార్పెట్ నుంచి ఈవెంట్ లోపలికి వెళ్లిపోయాడు. సీఎం ఎన్టీఆర్ అనే స్లోగన్ వినిపించడం ఇదే మొదటిసారి కాదు కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి… ఎన్టీఆర్ స్పందించాలని తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, కొంతమంది నందమూరి అభిమానులు కోరుకుంటున్న సమయంలో ఈ నినాదం వినిపించడం విశేషం.
Also Read
- Star Kids: 'శ్రీనివాస మంగాపురం' బాక్సాఫీస్ రిజల్ట్ స్టార్ వారసులకు హెచ్చరికేనా?
- Salman Khan: సల్మాన్ ఖాన్ ఖాతాలో మరో కొత్త కేసు... రూ.3 కోట్ల మోసం కేసులో కోర్టు సమన్లు!
- RC17 - Rukmini Vasanth: చరణ్ – సుకుమార్ సినిమాలో కాంతర హీరోయిన్!
- Dorothy Official Teaser : 'డొరోతి' టైటిల్ టీజర్.. దటీజ్ కార్తీక్ సుబ్బరాజ్
తాజావార్తలు
-
Star Kids: ‘శ్రీనివాస మంగాపురం’ బాక్సాఫీస్ రిజల్ట్ స్టార్ వారసులకు హెచ్చరికేనా?
-
Tarun Tejpal: అత్యాచార కేసులో సంచలన తీర్పు.. తేజ్‌పాల్‌కు 10 ఏళ్లు జైలుశిక్ష
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
-
Gautam Gambhir: మన హద్దులు దాటాలి.. శ్రీలంక టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాకు గంభీర్ వార్నింగ్
ట్రెండింగ్
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!