Jr NTR fires on paparazzi at Mumbai: జూనియర్ ఎన్టీఆర్ చివరిగా చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా మీద తన ఫోకస్ అంతా పెట్టాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమా ఇంకా ఒక కొలిక్కి రాలేదు. మొదటి భాగం ఇప్పటికే రిలీజ్ కావాల్సి న్నా దాన్ని అక్టోబర్ నెలకు వాయిదా వేశారు. ఇక బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న వార్ సినిమా సీక్వెల్ వార్ 2 సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లారు. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా ఈ సినిమాని వార్ సినిమా డైరెక్టర్ చేసిన అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నాడు.
DGP Ravi Gupta : డీజీపీ రవిగుప్తాకు సింగపూర్ ఎయిర్‌లైన్స్ రూ.2లక్షల నష్టపరిహారం
ఇక ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఒకరితో ఒకరు పోరాడే పాత్రలలో కనిపించబోతున్నారు. కియారా అద్వానీ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది ఆగస్టు 14వ తేదీన రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఎన్టీఆర్ వైట్ షర్ట్ ధరించి కనిపిస్తున్నాడు. ఆయన వెంట ఫొటోగ్రాఫర్ లు వెంట పడుతూ ఉండడంతో ఒకసారిగా అసహనానికి గురయ్యాడు. ఏయ్ అంటూ ఎన్టీఆర్ అరుస్తూ ఉండడం కనిపిస్తోంది. ఇక మరికొన్ని రోజులు ఎన్టీఆర్ ముంబైలోనే ఉంటారని తెలుస్తోంది. లుక్ లీక్ అవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న క్రమంలో ఈ మేరకు ఎన్టీఆర్ అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.