NTV Telugu Site icon

Jr NTR- Ramoji Rao: రామోజీరావు మృతి.. నన్ను టాలీవుడ్కి పరిచయం చేసింది మీరే అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్

Jr Ntr Ramoji Rao

Jr Ntr Ramoji Rao

Jr NTR Emotional Tweet on Ramoji Rao Death: రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. ఆయన వయసు ప్రస్తుతం 88 సంవత్సరాలు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావు తెల్లవారుజామున 4.50 గం.కు తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తోంది. నిన్న మధ్యాహ్నం అస్వస్థత ఏర్పడడంతో నానక్ రామ్ గూడలో ఒక ప్రయివేటు ఆసుపత్రికి తరలించగా అక్కడే ఆయన కన్నుమూశారు. ఇక ఫిల్మ్‌సిటీలోని నివాసానికి రామోజీరావు పార్థివదేహం తరలించారు.

Ramoji Film City: గిన్నీస్ బుక్లో రికార్డుల.. 2000 ఎకరాలు.. 2500 సినిమాలు.. రామోజీ ఫిలిం సిటీ గురించి మీకు ఇవి తెలుసా?

తాజాగా రామోజీ రావు మృతితో ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. శ్రీ రామోజీ రావు గారు లాంటి దార్శనీకులు నూటికో కోటికో ఒకరు. మీడియా సామ్రాజ్యాధినేత మరియూ భారతీయ సినిమా దిగ్గజం అయినటువంటి ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది. ఆయన మన మధ్యన ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం. ‘నిన్ను చూడాలని’ చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలు ఎప్పటికి మరువలేను. ఆ మహనీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని ట్వీట్ చేశారు.