Dragon Glimpse Records: ‘డ్రాగన్’ గ్లింప్స్‌తో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్.. 24 గంటల్లో భారతీయ సినీ హిస్టరీలోనే ఆల్‌టైమ్ రికార్డ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dragon Glimpse Records: గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్ – ఇండియా చిత్రం ‘#DRAGON’. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేయగా, ఇది ఇండియన్ మూవీ చరిత్రలోనే మునుపెన్నడూ ఎరుగని రీతిలో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ గ్లింప్స్ రిలీజ్ అయిన కేవలం 24 గంటల్లోనే యూట్యూబ్‌లో 64 మిలియన్లకు పైగా (6.4 కోట్లు+) వ్యూస్ సాధించింది. దీంతో భారతదేశంలోనే అత్యంత వేగంగా, అత్యధిక వ్యూస్ సాధించిన ఆల్‌టైమ్ నంబర్ 1 గ్లింప్స్‌గా ‘డ్రాగన్’ సరికొత్త రికార్డును లిఖించింది.
‘కేజీఎఫ్’, ‘సలార్’ చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్.. తన ప్రతి చిత్రాన్ని హై-వోల్టేజ్ యాక్షన్, డార్క్ థీమ్ ఎలివేషన్స్‌తో తెరకెక్కించడంలో తనదైన మార్క్‌ను ఇప్పటికే ప్రేక్షకులకు రుచి చూపించారు. ‘డ్రాగన్’ గ్లింప్స్‌లోనూ తన మార్క్ స్టైల్ కనిపిస్తుంది. ఎన్టీఆర్‌ను మునుపెన్నడూ చూడని అత్యంత పవర్ఫుల్ మాస్ అవతారంలో డ్రాగన్‌లో ప్రశాంత్ నీల్ ప్రెజెంట్ చేసిన విధానం, రవి బస్రూర్ అందించిన గూస్బంప్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చాయి. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో బాలీవుడ్ స్టార్ నటుడు అనిల్ కపూర్, రుక్మిణి వసంత్, బిజు మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని గుల్షన్ కుమార్, టీ-సిరీస్ (T-Series) తో పాటు మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ గ్లింప్స్ సాధించిన రికార్డులు థియేటర్లలో రాబోయే భారీ వసూళ్ల సునామీకి ముందస్తు సంకేతమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read
This is how #DRAGON set the world on fire 🔥#DragonGlimpse creates history as 𝐈𝐍𝐃𝐈𝐀’𝐬 𝐇𝐈𝐆𝐇𝐄𝐒𝐓 𝐕𝐈𝐄𝐖𝐄𝐃 𝐆𝐋𝐈𝐌𝐏𝐒𝐄 𝐢𝐧 𝟐𝟒 𝐇𝐎𝐔𝐑𝐒 with a massive 𝟔𝟒 𝐌𝐈𝐋𝐋𝐈𝐎𝐍+ 𝐕𝐈𝐄𝐖𝐒 on YouTube 🐉
Man of Masses @tarak9999… pic.twitter.com/TvEFFQ0RqQ
— Mythri Movie Makers (@MythriOfficial) May 20, 2026
తాజావార్తలు
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి