Site icon NTV Telugu

Jr NTR :అరుదైన ఘనత సాధించిన దేవర..

Whatsapp Image 2023 12 23 At 2.58.29 Pm

Whatsapp Image 2023 12 23 At 2.58.29 Pm

ఆర్.ఆర్.ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌ గా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.దేవర మూవీని దర్శకుడు కొరటాల శివ రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. దేవర మూవీ మొదటి పార్టును వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.ఇదే కాకుండా బాలీవుడ్ యాక్షన్ మూవీ వార్ 2 సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ హృతిక్ రోషన్ సరసన ఎన్టీఆర్ పవర్‌ ఫుల్ రోల్ చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలతో పాటు ఎన్టీఆర్ చేస్తున్న మరో క్రేజీ మూవీ NTR31. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు.కేజీఎఫ్ మూవీ తో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రశాంత్ నీల్ తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సలార్ సినిమాను తెరకెక్కించి మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా అనౌన్స్ మెంట్‌ తోనే భారీ అంచనాలు నెలకొంది.

ఇదిలా ఉంటే తాజాగా తన అభిమానులు తలెత్తుకునేలా ఎన్టీఆర్ మరో అరుదైన ఘనత సాధించాడు.2023లో ఆసియాలో టాప్ 50 నటుల జాబితాలో జూనియర్ ఎన్టీఆర్ చోటు సంపాదించుకున్నాడు. ఈ విషయాన్ని ఏషియన్ వీక్లీ మ్యాగజైన్ ‘ఈస్టర్న్ ఐ 2023’ పేరుతో ప్రకటించింది. ఆసియా టాప్ 50 యాక్టర్స్ జాబితాలో జూనియర్ ఎన్టీఆర్ 25వ స్థానంను సాధించుకున్నాడు. దీంతో ఈ జాబితాలో టాలీవుడ్ నుంచి అంటే తెలుగు నుంచి స్థానం సంపాదించుకున్న ఏకైగా హీరోగా ఎన్టీఆర్ నిలవడం విశేషంగా మారింది. ఈ వార్త తో ఎన్టీఆర్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.ఇక ఏషియన్ టాప్ 50లో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ మొదటి స్థానంలో నిలిచాడు. అలాగే అలియా భట్ మరియు ప్రియాంక చోప్రా రెండు, మూడు స్థానాలు సంపాదించుకున్నారు. ఇక రణ్‌బీర్ కపూర్‌కు 6, ఇళయదళపతి విజయ్‌కు 8 స్థానాలు లభించాయి.

Exit mobile version