WAR 2 Pre Release Event : ఎన్టీఆర్-హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న వార్-2 ఆగస్టు 14న రాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తాజాగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ హృతిర్ రోషన్ గురించి స్పెషల్ గా మాట్లాడారు. 25 ఏళ్ల క్రితం కహోనా ప్యార్ హై సినిమా చూశాను. అందులో హృతిక్ డ్యాన్స్ చూసి నాకు మెంటల్ ఎక్కింది. అక్కడ ఆయన డ్యాన్స్ చూసి మెస్మరైజ్ అయిన నేను నేను అతని బాడీ కోసం కష్టపడటం చూశాను. ఇండియాలో ఈ రోజు ఫైనెస్ట్ అండ్ ఇంఫికబుల్ యాక్టర్ ఉన్నారు అంటూ దటీజ్ హృతిక్ రోషన్.
Read Also : WAR 2 Pre Release Event : వార్ 2 సినిమా ఎందుకు చేశానంటే : ఎన్టీఆర్
ఇండియాలో తన కల కోసం అంత డెడికేషన్ ఉన్న వ్యక్తి హృతిక్ మాత్రమే. అతనికి హంబుల్ నెస్ ఎంతో ఉంది. నా కెరీర్ కూడా అతని లాగా స్టార్ట్ చేశా. ఆయన డ్యాన్స్ చూసి అలా చేయాలి అనుకున్న నేను.. 25 ఏళ్ల తర్వాత హృతిక్ తో యాక్ట్ చేయడం సంతోషంగా ఉంది. హృతిక్ రోషన్ దేశంలోనే గ్రేటెస్ట్ డ్యాన్సర్. అలాంటి మనిషి పక్కన డ్యాన్స్ చేయడం నా అదృష్టం. అతనికి ఎవరూ కాంపిటీషన్ లేరు. మీరు చూసే పాటలో ఎవరు గెలిచాడు.. ఎవరు ఓడాడు అనేదాని కోసం కాదు. కానీ ఆ పాట చేసింది ఇద్దరు గొప్ప డ్యాన్సర్లకు ఒక కాంప్లిమెంట్ లాంటిది. మీకు నేను గొప్ప డ్యాన్సర్ అనిపించొచ్చు. కానీ నా కంటే గొప్ప డ్యాన్సర్ హృతిక్ రోషన్. దీన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఇదంతా నా ఫ్యాన్ బాయ్ మూమెంట్ గానే మాట్లాడాను అంటూ చెప్పారు ఎన్టీఆర్.
Read Also : WAR 2 Pre Release Event : వార్-2లో ఊహించని పాయింట్ ఉంది : అయాన్ ముఖర్జీ
