Site icon NTV Telugu

RRR : చెర్రీ, తారక్ ల ఫేవరేట్ సీన్ ఇదేనట!

Rrr

Rrr

RRR మార్చి 24న థియేటర్లలో విడుదల కాగా, ఇప్పటికి ఈ సినిమా సృష్టించిన సంచలనం ఇంకా తగ్గనే లేదు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు అలియా భట్, అజయ్ దేవగన్, శ్రియా శరణ్ కీలక పాత్రల్లో నటించారన్న విషయం తెలిసిందే. దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో చిత్రబృందం ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. అందులో భాగంగానే ఏప్రిల్ 6న ముంబైలో ‘ఆర్ఆర్ఆర్ సక్సెస్ పార్టీ’ని ఏర్పాటు చేశారు. అక్కడ మీడియాతో మాట్లాడిన “ఆర్ఆర్ఆర్” త్రయం పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

Read Also : RRR : మూవీపై విదేశీ మీడియా రాతలు… రాజమౌళి ఊహించని రియాక్షన్

‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో తమకు ఇష్టమైన సన్నివేశాల గురించి ఎన్టీఆర్, రామ్ చరణ్ మాట్లాడుతూ ఇద్దరూ ఒకే సీన్ నచ్చిందని చెప్పుకొచ్చారు. ఇంటర్వెల్ లో వచ్చే సీన్ చెర్రీ, తారక్ కు సినిమాలో ఇష్టమైన సన్నివేశాల్లో ఒకటని చెప్పుకొచ్చారు. భీమ్, రామ్ మధ్య అపార్థాలు వచ్చే ఇంటర్వెల్ ఎపిసోడ్ నాకు ఇష్టమైన సన్నివేశం అని రామ్ చరణ్ అన్నారు. ఎన్టీఆర్ అందుకుంటూ “నాకు కూడా ఆ సీన్ చాలా ఇష్టం. ఇది రెండు పాత్రలు వారి మారు వేషం నుండి బయటపడే బెస్ట్ సీన్” అని అన్నారు.

Exit mobile version