NTV Telugu Site icon

Journey Movie: ప్రేమలో మళ్ళీ మునిగి తేలండి.. ఆరోజే ‘జర్నీ’ రీ రిలీజ్

Journey Movie Re Release

Journey Movie Re Release

Journey Movie to Re release on Valentines Day 2024: ఈ మధ్య కాలంలో ఒకప్పటి సినిమాలను రీ రిలీజ్ చేస్తున్న ట్రెండ్ బాగా నడుస్తోంది. ఇక దాదాపు పన్నెండేళ్ల క్రితం వచ్చిన ‘జర్నీ’ సినిమా అప్పట్లో యూత్‌ను ఎంతగా కట్టి పడేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంజలి జై, శర్వానంద్ అనన్య జోడి, వారి ప్రేమ కథలకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. మురుగదాస్ నిర్మాణంలో ఎం.శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి సీ.సత్య సంగీతం అందించగా అప్పట్లో ఈ సినిమాలోని పాటలు అప్పటి ప్రేక్షకులను ఇట్టే కట్టి పడేశాయి. థియేటర్ లో ఈ సినిమాను ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆదరించి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్‌ను చేశారు. ఇలాంటి బ్లాక్ బస్టర్ మూవీని ఇప్పుడు మళ్లీ రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.

Salaar : సలార్ సినిమాలో ప్రభాస్ గొడ్డుకారం మాత్రమే ఎందుకు తింటాడో తెలుసా?

ఇక టాలీవుడ్‌లో ఇప్పుడు రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న క్రమంలో ప్రతి నెలా ఏదో ఒక కల్ట్ క్లాసిక్ మూవీ రీ రిలీజ్ అవుతూనే ఉంది. ఈ రీ రిలీజ్‌లకు థియేటర్లు షేక్ అవుతున్నాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఇప్పుడు ఇదే క్రమంలో ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ‘జర్నీ’ని రీ రిలీజ్ చేయబోతున్నారని చెబుతున్నారు. లక్ష్మీ నరసింహా మూవీస్ బ్యానర్ మీద ఏ. సుప్రియ ఈ సినిమాను భారీ ఎత్తున మళ్లీ రీ రిలీజ్ చేయబోతున్నారు. ఫిబ్రవరిలో జర్నీని గ్రాండ్‌గా మళ్లీ థియేటర్లోకి తీసుకు రాబోతున్నారు మేకర్స్. ఇక ఈ క్రమంలో ఈ సినిమా ఎన్ని కలెక్షన్స్ రాబోతున్నాయి అనేది చూడాల్సి ఉంది.

Show comments