Revenge Action Thriller: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ మలయాళ యాక్షన్ రివెంజ్ థ్రిల్లర్.. యాక్టింగ్ ఇరగదీసిన జోజు జార్జ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revenge Action Thriller: మలయాళ సినిమా పరిశ్రమ అంటేనే విభిన్నమైన, మైండ్-బ్లోయింగ్ సస్పెన్స్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. దృశ్యం, మెమొరీస్, జోసెఫ్, అంజామ్ పాతీరా వంటి సినిమాలతో సైకో-థ్రిల్లర్, ఇన్వెస్టిగేటివ్ జోనర్లలో మలయాళీలు సరికొత్త ట్రెండ్ ను క్రియేట్ చేశారు. అదే కోవలో, టాలెంటెడ్ యాక్టర్ జోజు జార్జ్ ప్రధాన పాత్రలో నటించిన ‘వరవు’ (Varavu) మూవీ కూడా రివెంజ్ యాక్షన్ థ్రిల్లర్ గా థియేటర్లలో ఆడియన్స్ ను అలరించింది. ఇప్పుడు ఓటీటీలో కూడా దూసుకుపోతోంది. క్లైమాక్స్ వరకు నరాలు తెంపే ఉత్కంఠ తో సాగే ఈ సినిమాలో జోజు జార్జ్ యాక్టింగ్ కి ఆడియన్స్ కూడా ఫిదా అవుతున్నారు.
ZEE5లో స్ట్రీమింగ్
మలయాళ స్టార్ నటుడు జోజు జార్జ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘వరవు’ (Varavu). యాక్షన్ అండ్ మైండ్ బ్లోయింగ్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘వరవు’ సినిమా 2026 జూలై 16న థియేటర్లలో విడుదలైంది. థియేట్రికల్ రన్ తర్వాత, ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ZEE5లో 2026 సెప్టెంబర్ 11 నుండి డిజిటల్ స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాను థ్రిల్లర్ ఆడియన్స్, మలయాళ సినీ ఫ్యాన్స్ తెగ చూస్తున్నారు. ఇక ఈ మలయాళ యాక్షన్ రివెంజ్ థ్రిల్లర్ కి షాజీ కైలాస్ దర్శకత్వం వహించగా, నైసీ రెజి నిర్మించారు. ఈ సినిమాలో జోజు జార్జ్, అర్జున్ అశోకన్, మురళి గోపి, సానియా అయ్యప్పన్, దీపక్ పరంబోల్, బాబురాజ్, వాణి విశ్వనాథ్ కీలక పాత్రల్లో నటించగా, సామ్ సి.ఎస్. సంగీతం, ఎస్. శరవణన్ సినిమాటోగ్రఫీ అందించారు
Also Read
కథ
పాల్సన్ (జోజు జార్జ్) తను చేయని తప్పుకి జైల్లో శిక్ష అనుభవిస్తుంటాడు. అతని అక్క (నన్) వ్యాటికన్కు వెళ్తుంటే, ఆమెను కలవడానికి కేవలం 10 రోజుల పెరోల్‌పై తన సొంత ఊరికి వస్తాడు. ఊరంతా అతను అక్క కోసం వచ్చాడనుకుంటారు. అయితే అతని మనసులో మాత్రం ఒక పెద్ద పగ ఉంటుంది. తనను అన్యాయంగా జైలుకు పంపించి, తన కుటుంబాన్ని నాశనం చేసిన ఊరిలోని పెద్ద మనుషుల (విలన్ల) మీద రివెంజ్ తీర్చుకోవడానికే అతను వస్తాడు.
పాల్సన్ ప్రతీకారం తీర్చుకునే పద్ధతి చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. నాలుగేళ్ల క్రితం హఠాత్తుగా మాయమైపోయిన అతని తమ్ముడు విల్లీ (అర్జున్ అశోకన్) పేరును వాడుకుంటాడు. ఊరిలో విలన్ల మీద జరిగే ప్రతి దాడి వెనుక విల్లీయే ఉన్నాడని, వాడు తిరిగి వచ్చి తమ మీద పగ తీర్చుకుంటున్నాడని విలన్లు నమ్మేలా పాల్సన్ ఒక ప్లాన్ వేస్తాడు. దీనివల్ల విలన్లు భయంతో వణికిపోతారు. అసలు విల్లీ బతికే ఉన్నాడా? లేదా చనిపోయాడా? అనే సస్పెన్స్ చుట్టూ ఈ మైండ్ గేమ్ నడుస్తుంది.
విలన్లను మానసికంగా దెబ్బతీసిన తర్వాత, అసలు తన తమ్ముడు విల్లీకి ఏమైంది? గతంలో ఈ పొలిటికల్ మాఫియా తన కుటుంబాన్ని ఎలా దెబ్బతీసింది? అనే విషయాలను పాల్సన్ బయటపెడతాడు. చివరకు తన పది రోజుల పెరోల్ టైమ్ అయిపోయేలోపు, తన తెలివితో, యాక్షన్‌తో ఆ విలన్ల సామ్రాజ్యాన్ని పాల్సన్ ఎలా అంతం చేశాడనేదే ఈ సినిమా క్లైమాక్స్.
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!