NTV Telugu Site icon

John Travolta: జాన్ ట్రవోల్టా డ్రెస్ అంత ఖరీదా!?

Jhon

Jhon

John Travolta: ఈ మధ్య హాలీవుడ్ యాక్టర్ జాన్ ట్రవోల్టాతో కలసి మన ప్రియాంక చోప్రా చేసిన డాన్స్ భలేగా అలరించింది. ఇప్పుడు మరోమారు ట్రవోల్టా పేరు మారుమోగిపోతోంది. 1970లలో జాన్ ట్రవోల్టా డాన్స్ జనాన్ని కిర్రెక్కించింది. ఆ తరువాతి రోజుల్లో మన దేశంలో మిథున్ చక్రవర్తి, కమల్ హాసన్, చిరంజీవి వంటి వారు డిస్కో డాన్సుల్లో రాణించడానికి జాన్ ట్రవోల్టా ఇన్ స్పిరేషన్ అని చెప్పాలి. బీ జీస్ హిట్ కోసం జాన్ ట్రవోల్టా ధరించిన వైట్ షూట్ ను ఇప్పుడు వేలం వేయనున్నారు. అప్పట్లో ట్రవోల్టా కాస్ట్యూమ్ చూసి ఎంతోమంది హీరోలు ప్రపంచవ్యాప్తంగా మొత్తం వైట్ షూట్ వేసుకొని లోపల మాత్రం బ్లాక్ కలర్ షర్ట్ ధరించి అలరించారు. ఆ ఒరిజినల్ షూట్ ను ఇప్పుడు వేలం వేయబోతున్నారు.

ఏప్రిల్ 23-24 తేదీల్లో ఈ వేలం పాట సాగనుంది. పాతికవేల అమెరికన్ డాలర్లతో పాట మొదలవుతుందట. ట్రవోల్టా ధరించిన ఈ కాస్ట్యూమ్ ను కనీసం రెండు లక్షల డాలర్లకు అంటే మన కరెన్సీలో ఒక కోటి అరవై నాలుగు లక్షల రూపాయలన్నమాట! మోస్ట్ ఐకానిక్ కాస్ట్యూమ్స్ లో ఒకటిగా నిలచిన ఈ డ్రెస్ వేలం పాట ఈ రేంజ్ లో ఉంటుందని ఊహిస్తున్నారు. మరి ఆ రోజున ఏ తీరున సాగుతుందో చూడాలి.

Show comments