Jithender Reddy Releasing worldwide on May 3rd: బాహుబలి సినిమాతో గుర్తింపు పొందిన రాకేష్ వర్రే, గతంలో ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ సినిమాతో హీరో, నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘జితేందర్ రెడ్డి’ సినిమాతో హీరోగా మరోసారి పలకరించేందుకు సిద్ధం అవుతున్నారు. అస్సలు ఎవరు ఈ జితేందర్ రెడ్డి అని ? అని హీరో పేస్ రెవీల్ చెయ్యకుండా విడుదల చేసిన పోస్టర్స్ మంచి ఆదరణ పొందాయి.. ముదుగంటి క్రియేషన్స్ బ్యానర్ లో రాబోతున్న ఈ జితేందర్ రెడ్డి సినిమా రిలీజ్ డేట్ ను సినిమా యూనిట్ ఈరోజు అనౌన్స్ చేసింది. 2024 May 3న ఈ చిత్రం విడుదల కాబోతుంది అని చిత్ర దర్శకుడు విరించి వర్మ చెప్పారు.
Malavika Manoj: గుండెల్ని పిండేసిన హీరోయిన్ ను తెలుగులో దింపుతున్నారు
ఈ సందర్భంగా దర్శకుడు విరించి వర్మ మాట్లాడుతూ, ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నుండి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. హీరో ఎవరో చూపించకుండా విడుదల చేసిన పోస్టర్స్ కూడా మంచి క్యూరియాసిటీని పెంచాయన్నారు. ఈ జితేందర్ రెడ్డి జగిత్యాలలో 1980లలో యదార్ధంగా జరిగిన కథ, రియల్ స్టొరీ బాగా తియ్యడానికి చాలా రీసెర్చ్ అవసరమైంది, దాని కోసం నేను మా టీం వర్క్ ఔట్స్ చేసి, రెఫెరెన్సులు తీసుకుని, పెద్ద వారి సలహాలు తీసుకుని చాలా జెన్యూన్ గా చేశామని అన్నారు. మే 3న రిలీజ్ అయ్యే ఈ సినిమాలో రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
