Site icon NTV Telugu

Anjali: స్ట్రీమింగ్ కు రెడీ అయిన ‘ఝాన్సీ’ సీజన్ -2!

Jhansi

Jhansi

Anjali: ప్రముఖ నటి అంజలి ప్రధాన పాత్ర పోషించిన వెబ్ సీరిస్ ‘ఝాన్సీ’ ఇటీవల డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయ్యి, చక్కని ఆదరణను అందుకుంది. ఈ వెబ్ సిరీస్ లో యాక్షన్ ఓరియెంటెడ్ క్యారెక్టర్ లో అంజలి చేసిన స్టంట్స్ వ్యూవర్స్ ను ఆకట్టుకున్నాయి. తిరు దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ ను ట్రైబల్ హార్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై కృష్ణ నిర్మించారు. సైకలాజికల్ యాక్షన్ డ్రామా కథతో తెరకెక్కిన ‘ఝాన్సీ’ వెబ్ సిరీస్ కు ఇప్పుడు సెకండ్ పార్ట్ రాబోతోంది. జనవరిలో డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ఇది స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఇందులో అబ్ రామ్, ఆదర్శ్ బాలకృష్ణ, సంయుక్త హార్నాద్, చాందినీ చౌదరి, శరణ్య, రాజ్ అర్జున్, కళ్యాణ్ మాస్టర్, ముమైత్ ఖాన్ ఇతర కీలక పాత్రలు పోషించారు.

Exit mobile version