ఈరోజు 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం న్యూఢిల్లీలో జరిగింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సోమవారం జాతీయ చలనచిత్ర అవార్డులను అందజేశారు. ఐ అండ్ బి మంత్రి ప్రకాష్ జవదేకర్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. నేచురల్ స్టార్ నాని స్పోర్ట్స్ డ్రామా “జెర్సీ” ఉత్తమ తెలుగు చిత్రం, ఉత్తమ ఎడిటింగ్ విభాగాలలో రెండు జాతీయ అవార్డులను గెలుచుకున్న సంగతి తెలిసిందే. “జెర్సీ” దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, సితార ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ ఉప రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అత్యున్నత గౌరవాలను అందుకున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ చిత్రంలో నేచురల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాథ్ హీరోహీరోయిన్లుగా నటించారు. కాగా ఏప్రిల్ 2021లో కేంద్ర ప్రభుత్వం ఈ జాతీయ అవార్డులను ప్రకటించింది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా అవార్డు వేడుక ఆలస్యం అయింది. మరోవైపు సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు.
Read Also : దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును గురువుకు అంకితమిచ్చిన రజినీకాంత్
