Jeevitha Rajasekhar Clarity on Vyuham Movie Censor: రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమాకి సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చింది. సెన్సార్ RCకి ఈ సినిమాను రిఫర్ చేయడంతో ఈ విషయం మీద నట్టి కుమార్ కేంద్ర సెన్సార్ బోర్డుకు ఒక లేఖ రాశారు. సెన్సార్ బోర్డు ఆర్సీ మెంబర్ అయిన సీనియర్ నటి జీవిత రాజశేఖర్ వైసీపీ లీడర్ అయినందున, జీవిత రాజశేఖర్ ని ఈ సినిమా వరకు మాత్రమే సెన్సార్ చేయకుండా తొలగించాలని మనవి, ఎందుకంటే వ్యూహం ఒక పొలిటికల్ తెలుగు సినిమా, వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ కి పూర్తి అనుకూలంగా, ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులను వ్యంగంగా చూపిస్తూ ఈ సినిమాను రూపొందించారని, ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ను ఒక్కసారి చూస్తే ఆ విషయం చాలా సులువుగా అర్ధమవుతుందని రాసిన లేఖలో పేర్కొన్నారు.
వ్యూహం మూవీని తీసిన నిర్మాత దాసరి కిరణ్ కుమార్ కూడా వైసీపీ లీడర్, ఆయనను వైసీపీ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం మెంబర్ గా కూడా నియమించిందని, ఈ సినిమా డైరెక్టర్ ఆర్జీవీ, జీవిత రాజశేఖర్, ఆమె భర్త రాజశేఖర్ మంచి ఫ్రెండ్స్. కొంతకాలం క్రితం దెయ్యం అనే సినిమాను వర్మ వారితో రూపొందించారు విషయాలన్నీ పరిగణలోనికి తీసుకుని వ్యూహం సినిమా సెన్సార్ రివైజింగ్ కమిటీ నుంచి జీవిత రాజశేఖర్ గారిని తప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. ఇక ఈ విషయం మీద జీవిత స్పందించారు. నేను ఇప్పుడు బిజెపి పార్టీ లో ఉన్నా, నాకు వైఎస్ఆర్సిపి పార్టీకి ఎటువంటి సంబంధం లేదు (మీడియా గ్రూప్ లో సర్కులేట్ చేస్తున్న ఫోటోలు చాలా సంవత్సరాల క్రితంవి అని ఆమె పేర్కొన్నారు. వ్యూహం అనే సినిమా ఆర్ సి వచ్చినప్పుడు అన్ని సినిమాలు చూసినట్టుగానే ఆ సినిమాను కూడా చూస్తా, అయితే నాకు ఇంకా ఆఫీస్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదని ఆమె పేర్కొన్నారు. అయితే నా గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదని జీవిత రాజశేఖర్ చెప్పుకొచ్చారు.