Site icon NTV Telugu

టీజర్ : “జయమ్మ పంచాయితీ”లో సుమ గొడవ… సమస్య ఏంటి?

“జయమ్మ పంచాయితీ”లో సుమ గొడవ ఆసక్తికరంగా మారింది. యాంకర్ సుమ రీ-ఎంట్రీ చిత్రం “జయమ్మ పంచాయితీ” టీజర్ తాజాగా విడుదలైంది. రానా విడుదల చేసిన ఈ విలేజ్ డ్రామా మూవీ టీజర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గ్రామ పెద్ద, మొత్తం గ్రామస్తుల ముందు సుమ తన దృఢమైన వైఖరిని చూపడంతో టీజర్ ప్రారంభమవుతుంది. స్పష్టంగా ఆమె ఒక సమస్యపై న్యాయం కోరుతుందని అర్థమవుతోంది. అయితే ఆమె సమస్య ఏమిటన్న విషయాన్ని మాత్రం సస్పెన్స్ లో ఉంచారు మేకర్స్. ఇక ఆమె సమస్య విషయం మొత్తం గ్రామంలో హాట్ టాపిక్ అవుతుంది. కష్ట సమయాల్లో కూడా ఆమె స్వీట్లు తింటూ కనిపిస్తుంది. ఇది సినిమాలో ఆమె విలక్షణమైన పాత్రను సూచిస్తుంది.

Read Also : “శ్యామ్ సింగ రాయ్” సస్పెన్స్ కు తెర దించిన దర్శకుడు

“జయమ్మ పంచాయితీ” అనేది జయమ్మ సమస్య గురించి, ముఖ్యంగా ఆమె భర్త అనారోగ్యంగా ఉన్నట్లు టీజర్ ద్వారా వెల్లడించారు. మొత్తానికి జయమ్మగా సుమ సహజమైన నటనతో టీజర్ లో ఆకట్టుకుంది. విజయ్ కుమార్ కలివరపు ఒక సింపుల్ సూపర్ సబ్జెక్టు ను ఎంచుకొని ఈ గ్రామీణ నాటకాన్ని ఉల్లాసంగా చిత్రీకరించినట్టు అర్థమవుతోంది. ఇక ఈ సినిమాకు ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పెద్ద అసెట్. విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రాన్ని బలగ ప్రకాష్‌ నిర్మిస్తున్నారు.

Exit mobile version