సుమ కనకాల ప్రధాన పాత్రలో విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. ఈ నెల 22న రావాల్సిన ఈ చిత్రం విడుదల వాయిదా పడింది. మే 6న మూవీని రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. రేపు ఈ సినిమా ట్రైలర్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉదయం 11.07 నిమిషాలకు ఆవిష్కరించబోతున్నాడు. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించిన ఈ విలేజ్ డ్రామా టీజర్, పాటలతో చాలా ఆసక్తిని రేకెత్తించింది. ఇటీవలే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయగా, నేచురల్ స్టార్ నాని ఫస్ట్ సింగిల్, హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను కూడా ఆవిష్కరించారు. ఎవరికీ, దేనికీ లొంగని స్వార్థపూరితమైన పల్లెటూరి మహిళ పాత్రను ఇందులో సుమ పోషించింది. ఎం. ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.
గురువారం విడుదలైన ‘కేజీఎఫ్’ చిత్రం విజయకేతనం ఎగరేస్తుండటంతో… థియేటర్ల పంచాయితీ తేలకుండా సినిమా విడుదల చేయడం ఎందుకుని ‘జయమ్మ పంచాయితీ’ నిర్మాత భావించినట్టు అనిపిస్తోంది. ఎందుకంటే దీనితో పాటే విడుదల కావాల్సిన విశ్వక్ సేన్ ‘అశోకవనంలో అర్జున్ కళ్యాణం’ మూవీ రిలీజ్ నూ పోస్ట్ పోన్ చేశారు.
