Site icon NTV Telugu

Jayam Sada Sister: జయం మూవీలో సదా చెల్లెలి లేటెస్ట్ లుక్.. పెళ్లి చేసుకుని పిల్లలు కూడా?

Yamini Shwetha News

Yamini Shwetha News

Jayam Sada Sister Yamini Swetha Naidu Latest Photos: నితిన్ హీరోగా సదా హీరోయిన్ గా తెరకెక్కిన జయం సినిమా తెలుగు ప్రేక్షకులందరికీ హాట్ ఫేవరెట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. సుమారు 22 ఏళ్ళ క్రితం అంటే 2002వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఒక పెద్ద సెన్సేషన్ అనే చెప్పాలి. లవ్ తో పాటు ఎమోషన్స్, కామెడీ, యాక్షన్ కలగలిపి ఈ సినిమాని తేజ తెరకెక్కించాడు. ఈ సినిమాతో నితిన్ కి మంచి మాస్ హీరో ఇమేజ్ రాగా సదా కూడా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆమె చెప్పిన వెళ్లవయ్యా వెళ్ళు అనే డైలాగ్ ఇప్పటికీ కొంతమంది రిపీట్ చేస్తూ ఉంటారంటే ఆ క్రేజ్ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాల్లో ఇతర పాత్రలలో నటించిన వారందరికీ మంచి గుర్తింపు వచ్చింది. విలన్ గా గోపీచంద్ కి, కమెడియన్ గా సుమన్ శెట్టి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, షకీలా వీరందరూ తర్వాతి కాలంలో బిజీ అయ్యారు.

Jaya Jaya He Telangana: తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆస్కార్ గ్రహీత సంగీతం!

అయితే ఈ సినిమాలో సదా చెల్లెలి పాత్రలో నటించిన చిన్నారి గురించి మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎప్పుడు అక్క వెంటే ఉంటూ ఆమె విషయాలన్నీ ఇంటికి చేరవేసే చిన్నారి పాత్రలో ఆమె ఆకట్టుకుంది. అయితే ఆ అమ్మాయి ప్రజంట్ లుక్స్ బయటకు వచ్చాయి. ఆమె తన సోషల్ మీడియా వేదికగా ఈ ఫోటోలను షేర్ చేసింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆమెకు పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు. సదా చెల్లెలి పాత్రలో నటించిన ఆమె పేరు యామినీ శ్వేత. జయం సినిమా తర్వాత ఆమె సినిమాలు మీద కాకుండా చదువు మీద ఫోకస్ పెట్టి చదువు పూర్తి చేసింది. చదువు అయ్యాక వెంటనే పెళ్లి కూడా చేసుకుంది. ఇక ఆమె భర్త ఉద్యోగరీత్యా ఆయనతో పాటే ఆమె విదేశాల్లో సెటిలైంది. అయితే సిల్వర్ స్క్రీన్ కి దూరమైన ఆమె సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో టచ్ లో ఉండే ప్రయత్నం చేస్తుంది. అప్పుడప్పుడు తన ఫోటోలు తో పాటు ఫ్యామిలీ ఫోటోలు కూడా షేర్ చేస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఆమె ఫ్యామిలీ ఫోటోలతో పాటు ఆ ఫోటోలు కూడా చూసేయండి.

Exit mobile version