Site icon NTV Telugu

Jayam Ravi: ఐష్ చెప్పిన ఆ ఒక్క మాటతో నా పని అయిపోయిందనుకున్నాను

Jayam Ravi

Jayam Ravi

Jayam Ravi: భారీ తారాగణంతో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పొన్నియన్ సెల్వన్. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం మొదటి భాగం సెప్టెంబర్ 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్ల జోరును పెంచిన మేకర్స్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ వేదికపై హీరో జయం రవి మాట్లాడుతూ” నాకు తెలుగు వచ్చు.. నేను పుట్టింది చెన్నైలో అయినా పెరిగింది అంతా హైదరాబాద్ లోనే.. మీ వైబ్స్ నాకు తెలుసు. ఇది ఒక అద్భుతమైన చిత్రం.. ఇది ఇప్పటివరకు ఎక్కడ జరగలేదు.. ఇక జరగదు.. ఆ జరిగిన అద్భుతాన్ని సెప్టెంబర్ 30 న మీరు చూస్తారు. ఇక విక్రమ్ గారు.. విక్రమ్ అనేది ఒక నేమ్.. చియాన్ అనేది ఒక ఎమోషన్. అతనితో నటించడం ఎంతో గర్వంగా ఉంది. ఎంతో గోప్ప యాక్టర్.

ఇక ఐశ్వర్య రాయ్ గారికి మీకంటే ఎక్కువ ఫ్యాన్ ను నేను.. షూటింగ్ సమయంలో ఒక్కసారైనా కలుద్దామని అనుకున్నాను. కానీ కుదరలేదు.. షూటింగ్ చివరిరోజు.. ఆమె దగ్గరకు వెళ్లి ఏదేదో చెప్దామనుకున్నాను. కానీ, ఆమె నన్ను చూసి ఎలాంటి పాత్ర మీది.. ఎంతో బాగా నటించారు అని చెప్పారు. అంతే అయిపోయింది నా పని. రెహమాన్ గారు.. అలా ఊరికే వెళ్లి రెండు చేతుల్లో రెండు ఆస్కార్లు పట్టుకొని వచ్చారు. ఆస్కార్ల కంటే ఎక్కువ మీ మనస్సులో చోటు సంపాదించుకున్నారు. ఇక ఇదంతా ఒక వ్యక్తి వలన జరిగింది.. ఆయనే మణిరత్నం. ఈ సినిమాకు ఆత్మ ఆయనే.. 70 ఏళ్లుగా ఈ సినిమాను చేయడానికి కష్టపడుతుంటే ఆయన ఈ క్యాస్టింగ్ పెట్టుకొని ఈజీగా చేసేశారు. ఒక్కటి చెప్పాలంటే ఆయన మనీ పెట్టి ఈ సినిమా చేయలేదు మనసు పెట్టి చేశారు. ఈ సినిమా మంచి విజయం కావాలని మేమందరం కోరుకుంటున్నాం” అని చెప్పుకొచ్చాడు.

Exit mobile version