Site icon NTV Telugu

Jawan: నాలుగు రోజుల్లో 520 కోట్లు.. షారుఖ్ అంటార్రా బాబూ!

Jawan Collections

Jawan Collections

Jawan Box Office Collection: సౌత్ ఇండియన్ డైరెక్టర్ అట్లీ షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమా భారతదేశంలో 7 సెప్టెంబర్ 2023న బాక్సాఫీస్ వద్ద విడుదలైంది. ఈ సినిమా రిలీజ్ కంటే ముందే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా రూ.21 కోట్లు వసూలు చేసి అద్భుతమైన స్పందనను అందుకుంది. షారుఖ్ ఖాన్, నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పదుకొనే నటించిన జవాన్ సినిమా మొత్తం బాక్సాఫీస్ కలెక్షన్ కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.375 కోట్లు దాటగా నాలుగు రోజులకు గాను ఏకంగా 520 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా తొలిరోజు బాక్సాఫీస్ వద్ద అన్ని భాషలు కలిపి రూ.75 కోట్ల వరకు వసూలు చేసింది. జవాన్ మొదటి మూడు రోజుల్లో బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరిచి భారతదేశంలో రూ. 206.06 కోట్లు వసూలు చేసింది.

Sameera Sherief: రక్తమోడే ఫోటో షేర్ చేసిన నటి.. అసలు ఏమైంది?

జవాన్ నాలుగో రోజు అన్ని భాషల్లో రూ.82.00 కోట్లు వసూలు చేసింది. అంటే ఇప్పటి వరకు షారుక్ ఖాన్ సినిమా ఇండియాలో రూ.287.06 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఇక జవాన్ రెండో రోజు రూ.53.23 కోట్లు (అన్ని భాషలు) వసూలు చేయగా, మూడో రోజు రూ.77.83 కోట్లు (అన్ని భాషలు) వసూలు చేసింది. ఇక జవాన్ నాలుగు రోజుల్లో 4 పెద్ద రికార్డులను బద్దలు కొట్టింది. నిజానికి జవాన్ సినిమా కంటే ముందు షారుఖ్ నటించిన పఠాన్ సినిమా అనేక రికార్డులు బద్దలు కొట్టినా ఆ తరువాత వచ్చిన గదర్ 2 అనేక రికార్డులను బద్దలు కొట్టింది. దీంతో షారుఖ్ మళ్ళీ తన రికార్డులు తానే బద్దలు కొట్టే దిశగా దూసుకుపోతున్నాడు. ఇక పోటీగా సినిమాలు కూడా లేకపోవడంతో ఈ సినిమా మరిన్ని కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని అంటున్నారు.

Exit mobile version