Site icon NTV Telugu

Atlee: 8 ఏళ్ళ తరువాత తండ్రి కాబోతున్న విజయ్ డైరెక్టర్..

Atlee

Atlee

Atlee: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. త్వరలోనే తమ ఇంట చిన్నారి రాబోతున్నట్లు తెలిపాడు. అట్లీ భార్య ప్రియ ప్రెగ్నెంట్ గా ఉంది. 2013 లో రాజారాణి సినిమాతో డైరెక్టర్ గా మారి మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నాడు. ఇక రాజారాణిలో సహాయ నటిగా నటించిన ప్రియను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక ఈ జంట పెళ్ళైన ఎనిమిదేళ్ల తరువాత ఈ శుభవార్తను చెప్పుకొచ్చింది. బేబీ బంప్ తో ఉన్న భార్యతో అట్లీ నవ్వులు చిందిస్తూ ఉన్నఫోటోను షేర్ చేస్తూ తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు చెప్పుకొచ్చారు. దీంతో అట్లీ అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇకపోతే అట్లీ రాజారాణి తరువాత స్టార్ హీరో విజయ్ తో మూడు సినిమాలు తీసి మూడు హిట్లు అందుకున్నాడు. పోలీసోడు, బిగిల్, అదిరింది.. సినిమాలతో అట్లీ, విజయ్ డైరెక్టర్ గా మారిపోయాడు. ప్రస్తుతం అట్లీ.. జవాన్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడు. షారుఖ్ ఖాన్, నయన్ తార జంటగా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటుంది. మరి ఈ సినిమాతో అట్లీ బాలీవుడ్ లో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Exit mobile version