Site icon NTV Telugu

Jason Sanjay: విజయ్ కొడుకు మామూలోడేమీ కాదు.. సైలెంటుగా ఆ పని కానిచ్చేశాడు!

Jayon Vijay

Jayon Vijay

Jason Sanjay Vijay pursued a Film Production Diploma at Toronto Film School : అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ విజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ మాట్లాడుతూ సరికొత్త ఆలోచనలతో ఉన్న యంగ్ టాలెంటెడ్ పర్సన్స్ ఎప్పుడూ గేమ్ చేంజర్స్ గా ఉంటారని లైకా ప్రొడక్షన్స్ నమ్ముతుంటుందని ఇక మా బ్యానర్ లో నెక్ట్స్ ప్రాజెక్ట్ ను జాసన్ సంజయ్ విజయ్ డైరెక్ట్ చేయబోతున్నారనే విషయాన్ని తెలియజేయటానికి సంతోషంగా ఉందని అన్నారు. తను చెప్పిన యూనిట్ పాయింట్ నచ్చిందని అన్నారు. తను మా టీమ్ కి స్క్రిప్ట్ వివరించినప్పుడు మాకెంతో సంతృప్తికరంగా అనిపించిందని, తను స్క్రీన్ రైటింగ్, డైరెక్షన్ లో స్పెషలైజేషన్ కోర్సులను చేయడం చాలా గొప్ప విషయం. తనకు సినిమా నిర్మాణం పై పూర్తి అవగాహన ఉందని, ప్రతి ఫిల్మ్ మేకర్ కి ఇది ఉండాల్సిన లక్షణమని అన్నారు.

Nupur Sanon: ‘టైగర్ నాగేశ్వరరావు’ లవ్స్ ‘సారా’ నుపూర్ సనన్

ఇక డైరెక్టర్ జాసన్ సంజయ్ విజయ్ మాట్లాడుతూ ”లైకా ప్రొడక్షన్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థలో నేను తొలి సినిమా చేయబోతుండటాన్ని గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. కొత్త టాలెంట్ ఉన్న ఫిల్మ్ మేకర్స్ ఎంకరేజ్ చేసే ఓ కేంద్రంగా ఈ నిర్మాణ సంస్థ ఉందని, ఈ సంస్థకు నా స్క్రిప్ట్ నచ్చటం నాకెంతో సంతోషాన్ని కలిగించే విషయం అని అన్నారు. సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్స్, సాంకేతిక నిపుణులు మా సినిమాకి పని చేయబోతున్నారని, ఇంత మంచి అవకాశం ఇచ్చిన సుభాస్కరన్ కి థాంక్స్ చెప్పాడు. ఇది నాకెంతో ఎగ్జయిట్ మెంట్ తో పాటు పెద్ద బాధ్యత అని, ఇదే సందర్భంలో నాకెంతో సపోర్ట్ అందించిన తమిళ్ కుమరన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. ఇక జాసన్ సంజయ్ విజయ్ టొరంటో ఫిల్మ్ స్కూల్ నుంచి ప్రొడక్షన్ డిప్లొమా (2018 -2020)ను కంప్లీట్ చేశారు, అలాగే లండన్ లో స్క్రీన్ రైటింగ్ లో (రెండేళ్లు ఫాస్ట్ ట్రాకింగ్ కోర్స్) బి.ఎ. హానర్స్ (2020-2022)ను కంప్లీట్ చేశారని తెలుస్తోంది. ఇది తెలిసిన విజయ్ అభిమానులు సైలెంటుగా కోర్సులు చేసేసి భలే షాకిచ్చాడు గురూ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Exit mobile version