Jani Master: బెస్ట్ కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ కి నేషనల్ అవార్డు.. ఏ సినిమాకో తెలుసా?
- బెస్ట్ కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్
- తిరుచిత్రంబళం మేఘం కరిగేనా సాంగ్ కొరియోగ్రఫీకి నేషనల్ అవార్డు
- తెలుగులో తిరు పేరుతో డబ్బింగ్ చేసి రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jani Master Wins Best Choreography National Award for ‘Megham Karukatha’ in Thiruchitrambalam: తెలుగులో ఈ మధ్య బాగా ఫేమస్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కి నేషనల్ అవార్డు లభించింది. ఆయన కొరియోగ్రఫీ చేసిన ఒక సాంగ్ కారణంగా ఆయనకి బెస్ట్ కొరియోగ్రాఫర్ కేటగిరీలో అవార్డు దక్కింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే జానీ మాస్టర్ తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి, ఆయన స్వస్థలం నెల్లూరు. అయితే ఆయన చేసిన ఒక తమిళ సినిమాకి ఆయన బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు దక్కించుకున్నారు. ఆ సినిమా తిరుచిత్రంబళం. ఇదే సినిమాని తెలుగులో తిరు పేరుతో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. ధనుష్ హీరోగా నిత్యామీనన్ హీరోయిన్గా నటించారు.
Also Read
- Fauzi Shooting Update: 'ఫౌజీ' కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
- Spirit: స్పిరిట్ షూటింగ్'కి నెల రోజుల బ్రేక్
- Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
- Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
అనిరుద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ మీద అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆ రోజుల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకు గాను జానీ మాస్టర్ చేసిన మేఘం కరిగేనా అనే సాంగ్ కొరియోగ్రఫీ చూసిన జ్యూరీ మెంబర్లు ఫిదా అయిపోయారు. కానీ ఈ అవార్డుని ఆయన మరొక కొరియోగ్రాఫర్ తో కలిసి పంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సతీష్ కృష్ణన్ తో కలిసి జానీ మాస్టర్ ఈ అవార్డుని అందుకోబోతున్నారు. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఇదే సినిమాలో హీరోయిన్గా నటించిన నిత్యా మీనన్ కి బెస్ట్ యాక్ట్రెస్ క్యాటగిరిలో నేషనల్ అవార్డు లభించింది. ఆమె కూడా ఖర్చు ఎక్స్‌ప్రెస్ సినిమాలో నటించిన మానసి పరేఖ్ తో కలిసి ఈ అవార్డుని పంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో జనసేన పార్టీలో చేరి గత ఎన్నికలకు ముందు ఆ పార్టీ కోసం ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!