Jani Master: టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలకు పిచ్చెక్కించే స్టెప్స్ నేర్పించి.. అభిమానులు.. మా హీరో మాత్రమే ఇలాంటి స్టెప్పులు వేయగలడు అని కాలర్ ఎత్తేలా చేస్తాడు. ఇక ఈ కొరియోగ్రాఫర్, హీరోగా మారిన విషయం తెల్సిందే. అప్పుడెప్పుడో జానీ మాస్టర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. విజయ్ చౌదరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విజయ్ ఢమరుక ఆర్ట్స్ బ్యానర్ నిర్మిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇకపోతే నేడు జానీ మాస్టర్ పుట్టినరోజు కావడంతో.. తమ హీరోకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. దాంతో పాటు టైటిల్ ను కూడా అనౌన్స్ చేశారు.
Ustaad Bhagat Singh: ఈ కాంబో పై అంచనాలు కూడా మారవు.. వెయిటింగ్
జానీ మాస్టర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం పేరు రన్నర్ గా ఫిక్స్ చేశారు. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్స్ సైతం ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో జానీ మాస్టర్.. పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించనున్నాడు. మొదటి పోస్టర్.. తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ ముందు చేతులు పైకి ఎత్తి దండం పెడుతూ కనిపించగా.. రెండో పోస్టర్ లో ఒంటి నిండా గాయాలు.. ముఖం నిండా రక్తంతో పరిగెడుతూ కనిపించాడు. అసలు ఈ పోలీస్ ఆఫీసర్ రన్నర్ గా ఎలా మారాడు ..? అనేది తెలుసుకోవాలంటే సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే. ఇకపోతే ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించడం విశేషం. మరి ఈ రన్నర్ .. బాక్సాఫీస్ వద్ద విన్నర్ గా మారతాడా.. ? లేదా.. ? అనేది తెలియాలి.