Site icon NTV Telugu

Janhvi Kapoor: జాన్వీపై అపార్థం తొలగించిన పవిత్రా మేనన్..

Pavitra Minon , Janvi

Pavitra Minon , Janvi

జాన్వీ కపూర్ నటించిన తాజా రొమాంటిక్ కామెడీ ‘పరమ్ సుందరి’ ఇప్పటికే చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ సినిమాలో జాన్వీని మలయాళ యువతిగా చూపించడం కొందరికి నచ్చకపోవడంతో విమర్శలు వచ్చాయి. “మలయాళ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తీయాలంటే, అక్కడి నటీమణులే లేరా?” అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో గాయని పవిత్రా మేనన్ ఒక వీడియో విడుదల చేయగా ఈ వార్త తెగ వైరల్ అయ్యింది. అయితే..

Also Read : Avatar 2 : మళ్ళీ థియేటర్స్ లోకి ‘అవతార్ 2’.. !

తాజాగా పవిత్రా దీనిపై స్పష్టతనిచ్చారు. ఆమె మాట్లాడుతూ.. “నేను నటి కాదు, గాయనిని మాత్రమే. జాన్వీకి వ్యతిరేకంగా నేను ఎప్పుడూ మాట్లాడలేదు. నా ఉద్దేశం వేరే. ఇది వృత్తిపరమైన అసూయ కాదు. నేను ఎవరి అవకాశాలు లాక్కోవాలని అనుకోలేదు. కేవలం భాష గురించి మాత్రమే మాట్లాడాను. మలయాళ పాత్రలు చేసే వారు భాషను సరిగ్గా నేర్చుకోవాలి అనేదే నా పాయింట్. జాన్వీ ఆ పాత్రకు న్యాయం చేసింది. ఆమెను నేను వ్యక్తిగతంగా కూడా రెండు సార్లు కలిశాను. ఆమె చాలా సింపుల్ & డెడికేటెడ్ ఆర్టిస్ట్” అని స్పష్టం చేశారు. మొత్తనికి దీంతో ఈ వివాదానికి ఒక తేర పడింది. ఇక ‘పరమ్ సుందరి’ లో జాన్వీకి జోడీగా సిద్ధార్థ్ మల్హోత్రా నటించగా. కేరళ యువతి – ఢిల్లీ యువకుడి ప్రేమకథగా ఈ చిత్రానికి సెంటర్ పాయింట్. తుషార్ జలోటా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 29న విడుదలై ప్రేక్షకులను పలకరించింది. బాలీవుడ్ మూవీకిలో కెరళ ట్రేడినల్ టచ్ ఇవ్వడం మూవాకి మరింత ప్లేస్ అయ్యింది.

Exit mobile version