Site icon NTV Telugu

Janhvi Kapoor : ‘శారీరక సుఖాలు తప్పుకాదు’ వ్యాఖ్యలతో టాక్‌ షోలో తలపడ్డ స్టార్‌ హీరోయిన్లు..

Janvi Kapoor

Janvi Kapoor

బాలీవుడ్‌లో ఈ మధ్య టాక్‌ షోలు కూడా సినిమాల్లా హాట్‌ టాపిక్‌లుగా మారిపోయాయి. తాజాగా ‘టూ మచ్ టాక్‌ షో’లో జరిగిన ఓ చర్చ సోషల్ మీడియాలో భారీ హడావుడి రేపుతోంది. ఈ ఎపిసోడ్‌లో గెస్ట్‌గా హాజరైన జాన్వీ కపూర్ తో పాటు కాజోల్, ట్వింకిల్ ఖన్నా, కరణ్ జోహార్ పాల్గొన్నారు. షోలో వీళ్ల నలుగురు ప్రేమ, నమ్మకం, శారీరక సంబంధాలు, ఎమోషనల్ కనెక్షన్‌ వంటి విషయాలపై ఓపెన్‌గా మాట్లాడారు. అయితే “శారీరక సుఖాలు తప్పుకాదు” అనే వ్యాఖ్యతో షో హీట్‌గా మారింది.

Also Read : Nara Rohith : నారా రోహిత్‌- శిరీష.. హల్దీ వేడుక వీడియో చూశారా..!

మొదటగా కాజోల్‌, కరణ్‌, ట్వింకిల్‌ ముగ్గురూ ఒకే అభిప్రాయం వ్యక్తం చేశారు – తమ పార్ట్‌నర్ ఎమోషనల్‌గా వేరెవరితో కనెక్ట్ అయితే అది పెద్ద ద్రోహమని, ఫిజికల్‌ రిలేషన్‌ అంత సీరియస్‌ కాదని అన్నారు. వాళ్ల అభిప్రాయం ప్రకారం శారీరక సంబంధం క్షణిక మాత్రమే కానీ, భావోద్వేగ బంధం అయితే లోతైనదని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై జాన్వీ కాస్త అసహజంగా ఫీలై, కొద్దిసేపు ఆలోచించింది. ఆ తర్వాత, “నా దృష్టిలో ఫిజికల్‌, ఎమోషనల్‌ రెండూ తప్పే” అంటూ స్పష్టంగా తన అభిప్రాయం చెప్పింది. అయితే ఈ సమాధానాన్ని పెద్దవారైన ట్వింకిల్‌, కాజోల్‌, కరణ్‌ అంత ఈజీగా తీసుకోలేదు. ట్వింకిల్‌ మాట్లాడుతూ, “జాన్వీ ఇంకా చిన్నది, 30 ఏళ్లు కూడా దాటలేదు. 50 ఏళ్లు వచ్చిన తర్వాత మనం ఇవాళ ఎందుకు ఇలా చెప్పామో అర్థమవుతుంది” అని చెప్పడంతో అక్కడ వాతావరణం కాస్త టెన్షన్‌గా మారింది. కరణ్‌ కూడా, “ఫిజికల్‌ చీటింగ్‌ వల్ల బంధం విరగదు, కానీ ఎమోషనల్‌ చీటింగ్‌ కారణంగా సంబంధం శాశ్వతంగా మారిపోతుంది” అని చెప్పాడు. కానీ జాన్వీ మాత్రం, “నమ్మకం ఉన్న బంధం లో వేరే వారితో సంబంధం పెట్టుకోవడం ఎంత చిన్నదైనా తప్పే. అది నమ్మకానికి మోసం” అని గట్టిగా చెప్పింది.

ప్రస్తుతం ఈ షో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా మంది నెటిజన్లు ట్వింకిల్‌, కాజోల్‌, కరణ్‌ల అభిప్రాయాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “వివాహం లేదా ప్రేమ అంటే నమ్మకం, గౌరవం. శారీరక సంబంధం చిన్న విషయం కాదు” అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. జాన్వీ ఇచ్చిన సమాధానాన్ని చాలామంది ప్రశంసిస్తూ, “ఆమె ఇతరం నుంచి అంత మెచ్యూరిటీ రావడం ఆశ్చర్యం” అంటున్నారు. మొత్తం మీద, ఈ చర్చ ఒక్క ఎపిసోడ్‌తో ఆగిపోలేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫిజికల్‌ vs ఎమోషనల్‌ చీటింగ్‌పై పెద్ద డిబేట్‌ నడుస్తోంది. కొందరు “రిలేషన్‌ విలువ భావోద్వేగాల్లోనే ఉంటుంది” అంటుంటే, మరికొందరు “శారీరక నమ్మకం కూడా అంతే ముఖ్యం” అంటున్నారు. కానీ ఈ మొత్తం వివాదంలో జాన్వీ కపూర్‌ చెప్పిన మాట మాత్రం అందరి హృదయాలను తాకింది. “ప్రేమ అంటే గౌరవం, ఆ గౌరవాన్ని ఏ రూపంలోనైనా ద్రోహం చేయడం తప్పే.”

Exit mobile version