Jana Nayagan : జననాయగన్ రిలీజ్‌కు అన్ని దారులు క్లియర్.. రిలీజ్ ఎప్పుడంటే?

Jananayagan

Jananayagan

తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి తమిళనాడు ముఖ్యమంత్రిగా భాద్యతలు నిర్వర్తిసున్న సంగతి తెలిసిందే.  కానీ తన సినీ కెరీర్‌లో నటించిన 69వ చిత్రం అలాగే ఆఖరి సినిమా అయిన జననాయగన్ విడుదల మాత్రం వాయిదాలు మీద వాయిదాలు పడుతూ వస్తుంది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సిన జననాయాగన్ గత కొన్ని నెలలుగా సెన్సార్ ఇబ్బందుల వల్ల నిలిచిపోయిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ నెలలో థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

దర్శకుడు హెచ్. వినోద్ తెరకెక్కించిన ఈ హై-వోల్టేజ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్ లోనే చిత్ర యూనిట్ ఈ సినిమాను సెన్సార్ బోర్డ్‌కు పంపించింది. అయితే కొన్ని వివాదాస్పద రాజకీయ అంశాలు మరియు సాంకేతిక కారణాల వల్ల సెన్సార్ ప్రక్రియ నిలిచిపోయింది. దాదాపు 7 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు సెన్సార్ సమస్యలు పరిష్కారం అయ్యాయని త్వరలోనే క్లియరెన్స్ సర్టిఫికేట్ రాబోతుందని కోలీవుడ్ వర్గాల సమాచారం.ఈ సినిమా విడుదలకు మార్గం సుగమం కావడంతో భారీ స్థాయిలో సెలెబ్రేషన్స్ చేసేందుకు విజయ్ అభిమానులు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా విజయ్ రీల్ లైఫ్ నుండి రియల్ లైఫ్‌లో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎదిగే క్రమాన్ని, రాజకీయ ప్రయాణాన్ని ప్రతిబింబించేలా ఈ చిత్రం ఉండబోతోంది. ఆల్రెడీ మొత్తం సినిమా హై క్వాలిటీతో లీక్ అయినా కూడా దళపతిని వెండితెరపై ఆఖరిసారిగా చూడటానికి మరియు థియేటర్లలో ఒక భారీ పండగ వాతావరణాన్ని సృష్టించడానికి ఫ్యాన్స్ అంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించింది.