NTV Telugu Site icon

Sunny Naveen: `జైత్ర‌`యాత్ర ఎప్పటి నుండి అంటే..

Jaitra

Jaitra

Jaitra : అల్లం శ్రీతన్మయి సమర్పణలో ఎయిమ్స్ మోష‌న్ పిక్చ‌ర్స్‌ నిర్మిస్తున్న చిత్రం `జైత్ర‌`. స‌న్నీ న‌వీన్‌, రోహిణీ రేచ‌ల్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నారు. తోట మ‌ల్లికార్జున ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రానికి అల్లం సుభాష్ నిర్మాత‌. షూటింగ్ పూర్త‌యిన ఈ చిత్రం టీజ‌ర్ విడుద‌లై మంచి రెస్పాన్స్ లభించింది. మే 26న థియేటర్స్ లో ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కాబోతోంది.

Actor Ajay: ‘చక్రవ్యూహం’ టీజర్ విడుదల

రాయలసీమ స్లాంగ్, నేటివిటీతో తెరకెక్కిన ఈ సినిమాను మట్టితో చుట్టరికం చేసే ఒక రైతు కథను అందంగా తెరకెక్కించడం జరిగిందని, ఇటీవల విడుదలైన మూవీ సాంగ్స్, టీజర్ కు యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ లభించిందని, రాయలసీమ నేపథ్యంలో సినిమా అంటే ఫ్యాక్షన్ తప్పకుండా ఉంటుందనే భావన చాలా మందిలో ఉంటుందని, తమ సినిమా అందుకు భిన్నంగా రాయలసీమలో నివసించే ఒక రైతు కుటుంబానికి చెందిన కథ కథనాలతో రూపుదిద్దుకుందని దర్శక, నిర్మాతలు చెప్పారు.