NTV Telugu Site icon

Jailer: రజినీ కా హుకుమ్… జారీ అయ్యేది ఎప్పుడు?

Jailer

Jailer

సూపర్ స్టార్ రజినీకాంత్ బాక్సాఫీస్ పైన హుకుమ్ జారీ చేయబోతున్నాడు. ఆగస్టు 10న జైలర్ సినిమాతో బాక్సాఫీస్ ని షేక్ చేసి తన కలెక్షన్స్ స్టామినా ఏంటో రజిని మరోసారి ప్రూవ్ చేయడానికి రెడీ అయ్యాడు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ‘జైలర్’ సినిమా కోసం కోలీవుడ్ సినీ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆ వెయిటింగ్ ని మరింత పెంచుతూ, మూవీ లవర్స్ అందరినీ ఊరిస్తూ ‘కావాలా’ సాంగ్ సెన్సేషనల్ హిట్ అయ్యింది. మోస్ట్ వ్యూస్, హయ్యెస్ట్ రీల్స్ ని రాబడుతూ హవోక్ క్రియేట్ చేస్తున్న ‘కావాలా’ సాంగ్ జైలర్ సినిమాకి సాలిడ్ ప్రమోషన్స్ ని తెచ్చి పెట్టింది. సూపర్బ్ కిక్ ఇస్తూ మొదలైన జైలర్ ప్రమోషన్స్ ని అనిరుద్ పీక్ స్టేజ్ లోకి తీసుకొని వెళ్లడానికి రెడీ అయ్యాడు. జైలర్ సినిమా నుంచి ‘హుకుమ్’ అనే సెకండ్ సాంగ్ ని జులై 17న రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. అనిరుద్ కంపోజ్ చేస్తూ పాడనున్న ఈ సాంగ్ కోసం రజినీ ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పేట సినిమా నుంచి రజినీ-అనిరుద్ కలిస్తే చాలు సూపర్బ్ ఆల్బమ్ బయటకి వస్తుంది.

ఇదే మ్యాజిక్ రిపీట్ చేస్తూ జైలర్ మూవీకి కూడా అనిరుద్ సెన్సేషనల్ ఆల్బమ్ ఇచ్చాడని టాక్ వినిపిస్తోంది. సెకండ్ సాంగ్ ‘హుకుమ్’ కూడా బయటకి వస్తే జైలర్ సినిమా ప్రమోషన్స్ లో మరింత జోష్ కనిపించే అవకాశం ఉంది. సాంగ్ స్టార్టింగ్ లో టైగర్ కా హుకుమ్ అంటూ రజిని వాయిస్ కూడా ఉండడంతో జులై 17న రిలీజ్ అవ్వనున్న ఫుల్ సాంగ్ కోసం ఫాన్స్ ఇప్పటి నుంచే వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే జైలర్ సినిమా పాన్ ఇండియా మూవీగా అనౌన్స్ అయ్యింది. రజినీకాంత్ తో పాటు శివ రాజ్ కుమార్, మోహన్ లాల్ లాంటి సూపర్ స్టార్స్ కూడా జైలర్ సినిమాలో నటిస్తున్నారు. ఆ రేంజ్ స్టార్ హీరోలు ఉన్నా కూడా జైలర్ సినిమా ప్రమోషన్స్ తమిళ్ కి మాత్రమే పరిమితం అవుతున్నాయి. బౌండరీలు దాటి మేకర్స్ బయటకి రాకపోతే జైలర్ సినిమా ఓపెనింగ్స్ తమిళనాడులో తప్ప ఇంకెక్కడా ఉండే ఛాన్స్ లేదు.

Show comments