పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని శ్రీరాముడిగా చూపిస్తూ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆదిపురుష్’. కృతి సనన్ సీతాదేవిగా నటిస్తున్న ఈ మూవీపై స్టార్టింగ్ లో ట్రోలింగ్ ఫేస్ చేసింది. టీజర్ బయటకి రాగానే 500 కోట్లు ఖర్చు పెట్టిన ఆదిపురుష్ గ్రాఫిక్స్ ఇలా ఉందేంటి అంటూ ఆన్-లైన్ ఆఫ్-లైన్ లో ఊహించని నెగిటివిటీని ఎదురుకుంది. ఈ నెగిటివిటీ నుంచి ఆదిపురుష్ సినిమాని బయట పడేసింది ఒక్క పాట. ప్రభాస్ బాణం పట్టుకున్న పోస్టర్ ని రిలీజ్ చేస్తూ ‘జైశ్రీరామ్’ సాంగ్ ని మేకర్స్ బయటకి వదిలారు. ఈ ఒక్క పాట ఆదిపురుష్ సినిమా తలరాతనే మార్చేసింది. జైశ్రీరామ్ సాంగ్ బయటకి రావడం, ఆదిపురుష్ సినిమా లెక్కలు మారడం ఒకేసారి జరిగాయి. ఎక్కడ చూసినా ట్రెండ్ అవుతున్న జై శ్రీరామ్ ఫుల్ సాంగ్ ని మేకర్స్ గ్రాండ్ గా లాంచ్ చేసారు.
ఒకప్పుడు అందరూ విమర్శించిన ఆదిపురుష్ సినిమా ఈరోజు ప్రతి ఒక్కరి నుంచి కాంప్లిమెంట్స్ అందుకునే స్థాయికి వచ్చింది అంటే జై శ్రీరామ్ సాంగ్ పుణ్యమే. ఈ సాంగ్ లేని ఆదిపురుష్ ప్రమోషనల్ క్యాంపైన్ ని ఊహించడం కూడా కష్టమే. ఆదిపురుష్ సినిమాపై ఉన్న నెగిటివిటీని తీసెయ్యడమే కాకుండా జై శ్రీరామ్ సాంగ్ బిజినెస్ కూడా పెంచేలా చేసింది. ప్రస్తుతం ఉన్న ట్రేడ్ లెక్కల ప్రకారం ఆదిపురుష్ సినిమాకి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 125 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. యువీ క్రియేషన్స్ ఈ భారీ మొత్తం చెల్లించి ఆదిపురుష్ తెలుగు థియేట్రికల్ రైట్స్ ని సొంతం చేసుకుంది. హిట్ టాక్ వస్తే 125 కోట్లు రాబట్టడం ప్రభాస్ సినిమాకి పెద్ద కష్టమైన విషయమేమి కాదు. తెలుగు కన్నా నార్త్ లో ఆదిపురుష్ సినిమాకి మంచి క్రేజ్ ఉంది కాబట్టి అక్కడ బిజినెస్ పరంగా ఫైనల్ ఫిగర్స్ ఎలా ఉంటాయి అనేది ఆదిపురుష్ రేంజ్ ని డిసైడ్ చేస్తాయి.