NTV Telugu Site icon

Adipurush: నీ నామస్మరణ మహిమాన్వితం రామా…

Adipurush Collections

Adipurush Collections

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్’. ఓం రౌత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ 500 కోట్లు రాబట్టి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం ఆదిపురుష్ కలెక్షన్స్ డౌన్ ట్రెండ్ లో ఉన్నా కూడా వస్తున్న కలెక్షన్స్ మాత్రం స్టార్ హీరోల హిట్ సినిమాల రేంజులో ఉన్నాయి. ఆదిపురుష్ సినిమాపై నిజానికి టీజర్ నుంచే ఎవరికీ ఎలాంటి అంచనాలు లేవు. టీజర్ లో చూపించిన విజువల్ ఎఫెక్ట్స్ ని సినీ అభిమానులంతా భయపడ్డారు. సోషల్ మీడియాలో కూడా ఆదిపురుష్ సినిమాపై విపరీతమైన నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యింది. ప్రభాస్ ఫాన్స్ సైతం డైరెక్టర్ ఓం రౌత్ ని టాగ్ చేసి విమర్శలు చేసారు. అంతటి నెగిటివిటీ ఫేస్ చేసి కూడా ఆదిపురుష్ సినిమా 500 కోట్లు రాబట్టింది అంటే అది పూర్తిస్థాయిలో ప్రభాస్ కి దక్కాల్సిన క్రెడిట్.

Read Also: Kajal Agarwal : ట్రెడిషనల్ లుక్ లో కవ్విస్తున్న కాజల్.

ప్రభాస్ మేనియానే ఈరోజు ఆదిపురుష్ నష్టాలని తగ్గిస్తోంది. అయితే ట్రోలింగ్ ఫేస్ చేస్తున్న ఆదిపురుష్ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యేలా చేసింది ‘జై శ్రీరామ్ సాంగ్’. ఈ ఒక్క పాట ఆదిపురుష్ జాతకాన్ని మార్చేసింది. బిజినెస్ పెరిగింది, అంచనాలు పెరిగింది అన్నీ జై శ్రీరామ్ సాంగ్ పుణ్యమే. ఆదిపురుష్ సినిమాకే హైలైట్ గా నిలిచిన జై శ్రీరామ్ వీడియో సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. ఈ సాంగ్ విజువల్స్ సూపర్బ్ గా ఉన్నాయి. యూట్యూబ్ లోనే ఇలా ఉంటే 3D ఎఫెక్ట్స్ తో థియేటర్ లో జై శ్రీరామ్ సాంగ్ ని చూస్తే గూస్ బంప్స్ రావడం గ్యారెంటీ అనిపించేలా ఉంది.

Show comments