Site icon NTV Telugu

SRK Mahesh: జవాన్ లో క్లైమాక్స్ చూస్తూ థియేటర్ లో ‘మహేష్’ అని అరుస్తున్నారు సార్

Srk Mahesh

Srk Mahesh

కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాతో పఠాన్ సక్సస్ ని కంటిన్యూ చేయడానికి థియేటర్స్ లోకి వచ్చాడు. పఠాన్ సక్సస్ ని కంటిన్యూ చేయడానికి కాదు పఠాన్ రికార్డ్స్ ని బ్రేక్ చేయడానికి తుఫాన్ లా వచ్చాడు షారుఖ్ ఖాన్. సౌత్ సెన్సేషన్ అట్లీ, మన సినిమాల్లో ఉండే మాస్ ఎలిమెంట్స్ ని బాలీవుడ్ కి రుచి చూపించి నెవర్ బిఫోర్ ఓపెనింగ్ ని రాబట్టాడు. మొదటి రోజు ర్యాంపేజ్ కలెక్షన్స్ ని రాబట్టిన షారుఖ్ ఖాన్, లాంగ్ రన్ లో బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ కొట్టేలా ఉన్నాడు. అట్లీ తన మార్క్ సోషల్ ఎలిమెంట్స్ ని కథలో పెట్టి జవాన్ సినిమా చేసాడు. శంకర్ స్టైల్ లో సినిమాల్లో సోషల్ ఇష్యూస్ ని డిస్కస్ చేయడం అట్లీకి అలవాటు. జవాన్ సినిమాలో కూడా అట్లీ, ఇలానే డిస్కస్ చేసాడు. హీరో క్యారెక్టర్ తో సంఘంలో జరుగుతున్న వాటి గురించి మాట్లాడించాడు.

ముఖ్యంగా ఒక సీన్ లో రాజకీయ నాయకులకి ఓట్ వేసే సమయంలో… వచ్చే అయిదేళ్ల పాటు మాకు ఏం చేస్తావ్ అని అడిగి ఓటు వేయండి అనే డైలాగ్ ని షారుఖ్ చెప్తాడు. ఈ డైలాగ్ ని బాలీవుడ్ అంతా అట్రాక్ట్ అవుతుంటే తెలుగు ఆడియన్స్ మాత్రం “మహేష్ బాబు, మహేష్ బాబు” అంటూ థియేటర్స్ లో గోల పెడుతున్నారు. మహేష్ గత కొంతకాలంగా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలనే చేస్తూ ఉన్నాడు, అందుకే జవాన్ క్లయిమాక్స్ లో ఫ్యాన్స్ మహేష్ పేరుని అరుస్తున్నారు థియేటర్స్ లో… ఇంకొంత మంది అయితే “ఇది మహేష్ బాబు సినిమా… మహేష్ సినిమాలో, మహేష్ ప్లేస్ లో షారుఖ్ ఖాన్ నటించాడు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అతడు, ఒక్కడు, దూకుడు, బిజినెస్ మాన్, పోకిరి లాంటి సినిమాలు చేసిన మహేష్ బాబుని కామెంట్స్ చేస్తున్న వాళ్లకి గుంటూరు కారం సినిమా సాలిడ్ ఆన్సర్ ఇస్తుందేమో చూడాలి.

Exit mobile version