Jai Hanuman: ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’లో ధురంధర్ నటుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ తెలుగు చిత్రం ‘జై హనుమాన్’. దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక డివోషనల్ యాక్షన్ డ్రామా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం బాలీవుడ్ సెన్సేషనల్ నటుడు అక్షయే ఖన్నాను ఎంపిక చేసినట్లు సమాచారం వినిపిస్తోంది. ‘ధురంధర్’ వంటి సినిమాలతో పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన నటుడు ఈ ప్రాజెక్టులో చేరడం సినిమాకు మరింత బలాన్ని ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రశాంత్ వర్మ ఇప్పటికే తన ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ (PVCU)లో భాగంగా “మహాకాళీ” చిత్రాన్ని కూడా లైన్‌లో పెట్టారు. అక్షయే ఖన్నా ఈ యూనివర్స్‌లో కూడా నటిస్తున్నారని, ఆ లింక్‌తోనే ఆయన ‘జై హనుమాన్’లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్. ధురంధర్ చిత్రంలో అక్షయేకు లభించిన గుర్తింపు కారణంగా, ఆయన పాత్ర ఈ సినిమాలో చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ క్రేజీ అప్‌డేట్ ఇప్పుడు ఫ్యాన్స్‌లో సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. అయితే, ఈ వార్తలపై మరింత స్పష్టత రావాలంటే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. రిషబ్ శెట్టి – ప్రశాంత్ వర్మ కలయికలో రాబోతున్న ఈ చిత్రం హనుమంతుడి కథను కొత్త కోణంలో ఆవిష్కరించబోతోందని సమాచారం.
Also Read
తాజావార్తలు
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!