Site icon NTV Telugu

సూర్య ‘జై భీమ్’ హిందీ ట్రైలర్ విడుదల

Jai-Bhim

Jai-Bhim

సూర్య లాయర్ గా నటిస్తున్న సినిమా ‘జై భీమ్’. ఈ లీగల్ డ్రామాను టి. జె. జ్ఞానవేల్ దర్వకత్వంలో సూర్య, జ్యోతిక కలిసి తమ 2డీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ ద్వారా నవంబర్ 2న ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇప్పటికే తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషలలో ట్రైలర్ ను విడుదల చేశారు. తాజా సూర్య హిందీ వర్షన్ ట్రైలర్ లింక్ ను సోమవారం తన సోషల్ మీడియా అక్కౌంట్ లో పోస్ట్ చేశారు. దేశానికి యాభై సంవత్సరాలు వచ్చినా మెరుగుపడని గిరిజనుల జీవిత గాథను ‘జై భీమ్’ చిత్రంలో చూపించబోతున్నారు. వారి పక్షాన నిలిచి న్యాయపోరాటం చేసే చంద్రు అనే లాయర్ గా సూర్య కనిపించబోతున్నాడు. ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ తో పాటు రజిషా విజయన్, లిజొమోల్ జోస్, కె. మణికందన్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.

Read Also : దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును గురువుకు అంకితమిచ్చిన రజినీకాంత్

Exit mobile version